నాగుప్పెట్లో
రహస్యాలులేవు
చెవుల్లో
ఊదటానికి
నాగుప్పెట్లో
డబ్బులులేవు
జల్సాల్లో
ముంచటానికి
నాగుప్పెట్లో
విత్తనాలులేవు
పుడమిపైచల్లి
పచ్చపరచటానికి
నాగుప్పెట్లో
మిఠాయిలులేవు
నోర్లను
ఊరించటానికి
నాగుప్పెట్లో
పువ్వులులేవు
తలలపైచల్లి
దీవించటానికి
నాగుప్పెట్లో
విభూతిలేదు
మంత్రించి
చల్లటానికి
నాగుప్పెట్లో
అంజనంలేదు
వాస్తవాలను
చూపించటానికి
నాగుప్పెట్లో
తాయిలాలులేవు
పంచి
ప్రలోభపెట్టటానికి
నాగుప్పెట్లో
రంగులులేవు
ముఖాలకుపూచి
హోళీజరుపుకోనటానికి
నాగుప్పెట్లో
అక్షరాలున్నాయి
అమర్చి
ఆనందపరచటానికి
నాగుప్పెట్లో
పదాలున్నాయి
పేర్చి
పరవశపరచటానికి
నాగుప్పెట్లో
కైతలున్నాయి
చేర్చి
సంతసపరచటానికి
నాగుప్పిట్లో
ప్రపంచమున్నది
చూపించి
చైతన్యపరచటానికి
నామనసు
గుప్పెడు
నాహృదయం
గుప్పెడు
నాగుప్పెటను
తెరవమంటారా
కవితలను
కుమ్మరించమంటారా
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి