సౌందర్యలహరి ;- కొప్పరపు తాయారు
  🌟 శ్రీ శంకరాచార్య విరచిత 🌟

పురారాతేరంతఃపురమసి తతస్త్వచ్చరణయోః
సపర్యామర్యాదా తరలకరణానామసులభా ।
తథా హ్యేతే నీతాః శతమఖముఖాః సిద్ధిమతులాం
తవ ద్వారోపాంతస్థితిభిరణిమాద్యాభిరమరాః ॥ 95 ॥

కలత్రం వైధాత్రం కతికతి భజంతే న కవయః
శ్రియో దేవ్యాః కో వా న భవతి పతిః కైరపి ధనైః ।
మహాదేవం హిత్వా తవ సతి సతీనామచరమే
కుచాభ్యామాసంగః కురవకతరోరప్యసులభః ॥ 96 ॥

95) అమ్మా !నువ్వు పరమశివుని  రాణివి. అందువలన చెంచలాత్మలకు నీ చరణ రాజీవ సేవా భాగ్యం లభించదు. నీ గృహ ప్రాంగణములో వశించే ఇంద్రాది దేవతలు అణి మాదిసిద్ధులతో మహత్తర లాభాలను పొందుతున్నారు కదా! తల్లి!

,96) ఓ గిరిజనందిని ! ఎందరో కవీశ్వర్లు సరస్వతిని
ఆరాధిస్తున్నారు. ఎందరో లక్ష్మికి అధిపతులు అవుతున్నారు. పతివ్రతలలోపల సంస్థానాన్ని అలంకరించిన తల్లీ ! మహాదేవునికి వినా నీ ఆలింగనం ఎర్ర గోరింటాకు కూడా దొరకదు ‌. అంటే విద్యా ధనాలు లభిస్తాయి కానీ నువ్వు ఎవరికి వసురాలవు కావు కదా ! తల్లీ!
🪷 ***🪷*****🪷
🌟 తాయారు 🪷
కామెంట్‌లు