కీలకపాత్ర;- డా.గౌరవరాజు సతీష్ కుమార్
దేశజనాభాలో సింహభాగం
ఆక్రమించిన యువత
దేశాభివృద్ధిలో కీలకపాత్ర
వహించేది యువత
నవభారత జాతి నిర్మాణమే
పరమ కర్తవ్యమైన యువత
సమత మమత పెంచుటకై
నడుంకట్టేది యువత
తాడిత పీడిత జనులకు
ఊతగర్రగా నిలిచేది యువత
జనశిక్షణ జనరక్షణ 
జనజాగృతి సలిపేది యువత
పసిబాలల బడుగువర్గ
అభ్యున్నతికై పాటుపడేది యువత
దేశభవిత మార్చుటకై అహరహం
శ్రమించేది యువత
భారతాంబ రక్షణకై ధైర్యంగా
నడుంబిగించేది యువత
మాతృభూమి ఋణం తీర్చి
యశంపెంచె గట్టిపాత్ర యువతదే!!
************************************
 
కామెంట్‌లు