వివేకం;-సి.హెచ్.ప్రతాప్
 అముల్యమైన, అందమైన ఈ జీవితాన్ని మనం
రాగ ద్వేషాలతో, అసూయా , కపటాలు ,కార్పణ్యాలతో
దుర్భరం చేసుకుంటున్న తీరు బాధాకరం
నీటి బుడగ లాంటిది  ఈ జీవితం
కన్ను మూస్తే జననం
కన్ను మూస్తే మరణం
క్షణ భంగురమైన ఈ జీవితం కోసం
ఎందుకీ అనవసర ప్రాకులాటలు ?
తోటి వారిని మోసం చేయడం
హింసించడం , మానసికంగా గాయపరచడమెందుకు ?
ఇతరుల సొత్తును లాక్కునేందుకు
ఎందుకీ మోసపూరిత పనులు ?
వచ్చేటప్పుడు ఖాళీ చేతులతో వచ్చి
పోయేటప్పుడు కూడా రిక్తహస్తాలతో వెళ్ళే
మనకు ఈ కుట్రలు, కుతంత్రాలు అవసరమా ?
సాటి వారిని ఆప్యాయంగా పలుకరిస్తూ
వారి కష్ట సుఖాలలో పాలు పంచుకుంటూ
వున్న దానిలో అన్నార్తులకు సహాయం చేస్తూ
ధర్మయుతంగా కోరికలు తీర్చుకుంటూ
భగవంతుడిచ్చిన దానితో సంతృప్తి చెందుతూ
ప్రసాద భావంతో ఆనందకరమైన
జీవితం గడపడమే వివేకవంతుల లక్షణం 
కామెంట్‌లు