శ్రీ విష్ణు సహస్రనామాలు (బాల పంచపది )ఎం. వి. ఉమాదేవి
371)వేగవాన్ -

అమితవేగము గలిగినవాడు
పవనముగా వ్యాపించువాడు
కాలవేగము చూపించువాడు
వేగవంతంగా చరించువాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
372)అమితాశనః -

అమితమైన ఆకలిగలవాడు
అన్నిటిని జీర్ణించుకొనువాడు
అపరిమిత క్షుత్తున్నట్టివాడు
అమితాశన నామమున్నవాడు 
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
373) ఉద్భవః -

ప్రపంచం సృష్టిచేసినవాడు
ఉపాదానము అయినవాడు
సృష్టికారణముగా నున్నవాడు
సృజనము చేసినట్టి వాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
374)క్షోభణః -

సృష్టిని వణికించగలవాడు
యుగాంతము జేయగలవాడు
క్షోభను గలిగించు వాడు
కల్లోలము జేయగలవాడు
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
375)దేవః -

క్రీడించుచున్నట్టి వాడు
వేలుపుతానై యున్నవాడు
దేవతరూపున యున్నవాడు
దివ్య శక్తులు గలిగినవాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!

(సశేషం )
కామెంట్‌లు