అనంతశయనం అయ్యంగార్;- అచ్యుతుని రాజ్యశ్రీ
 లోక్సభ సభ్యులు గా 28 ఏళ్ళు! హాస్యం గా చురకలు అంటించటంలో ప్రసిద్ధులు.ఉపసభాపతిగా అనంతవచన అయ్యంగార్ గా  అంతా ఆప్యాయంగా పిలవడం ఆయన వాగ్ధాటికి నిదర్శనం.ఏకాస్త ఎవరైనా అగౌరవ పరిస్తే సభానియమాలు  ధిక్కరిస్తే అంతే సంగతులు. 4ఫిబ్రవరి 1891 లో తిరుచానూరు లో శ్రీవైష్ణవ సంప్రదాయ కుటుంబంలో జననం.తిరుపతిలో మెట్రిక్ మద్రాస్ లో.  లా చదివి. చిత్తూరు లో ప్రాక్టీస్ ప్రారంభించారు.న్యాయవాద సంఘం అధ్యక్షుడు గా హరిజనోద్యమ నాయకులు గా ఆరోజుల్లో  తిరుపతి లో హరిజన హాస్టల్ నెలకొల్పారు. కొండా వెంకటప్పయ్య పంతులు గారి ప్రేరణతో లాయర్ వృత్తి కి స్వస్తి పలికి ఖాదీ మద్యపాన నిషేధం ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు.1959 లో కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ కి ప్రెసిడెంట్.ఆటవికుల్లో నేరాల్ని అరికట్టడానికి కుష్ఠురోగులపై శ్రద్ధ కనబరిచారు.సంస్కృతంలో పండితుడు.కేంద్రీయసంస్కృతపీఠానికి అధ్యక్షులు గా ఉన్నారు.విశ్వహిందూపరిషత్ కి అధ్యక్షులు గా ఆయన సేవలు అపారం.12మంది సంతానం తో ఇల్లు పూపొదరిల్లు.పొట్టి ఆకారం! గట్టి ఉద్దండులు అనంతహృదయుడు అని ఆనాటి హేమాహేమీలు దేళనాయకుల ప్రశంసలందిన తెలుగు తేజం.లోక్సభ స్పీకర్ గా అందరి మన్ననలు పొందారు.1978 జనవరి 19 న అమరులైనారు🌷
కామెంట్‌లు