సుప్రభాత కవిత ; - బృంద
నిశిలో నిదురించిన జగతికి
కొత్తగా వచ్చిచేరిన శక్తి
మత్తును విదిలించి ముందుకు
అడుగేసే ఉత్తేజపు యుక్తి

తమస్సును తొలగించే
జ్యోతి కలశపు కాంతులతో
మేటిగ తోచే ప్రకృతి
కలిగెను హృధిలో జాగృతి

అవగతమైన గతములో
అనుభవాల సారంతో
అగోచరమైన భవిష్యత్తుపై
అనవసర  భయం వీడి

అరుదైన చేతిలోని 
అపురూప క్షణాలను
అపూర్వంగా మలుచుకుని
ఆనందపడితే  అదే జీవితం

అందుకోలేని ఎత్తులకన్నా
అరచేతిలోని స్వర్గంలా
అందిన  ఎత్తులో ఆనందం
తెలుసుకున్న మనసే మిన్న

స్పందించే చేసే సాయం
అందించే చిన్నచేయూత
ఆనందించి అభినందించే
అపురూప గుణం..

సహజంగా అందరికీ
సహకరించే సౌజన్యం
బహుకరించి గొప్పగా
బ్రతుకులను నడిపించే

వేకువకు

🌸🌸 సుప్రభాతం🌸🌸
కామెంట్‌లు