ప్రభూ!
ఎక్కడున్నావు తండ్రీ!
ఎక్కడని నీకోసం వెతకను?
నీవులేక నేనెలా మనగలను?
నీవేనాకు ఒకప్పుడు ఉపదేశించావు
ఆమార్గంలోనే నేను నడుస్తున్నాను
అయినా అడుగడుగునా సందేహమే
మరి ఇది ముళ్ళునిండిన దారిలా ఉంది
ఊ...హూ...
నే నెవరిమాటా వినను
నీవు చెప్పినట్లే నడుస్తా
అయినా....
నేనేంచేయనయ్యా!?
నా విశ్వాసం అంత బలంగాలేదు
నా మనస్సంతా చీకటే
నాకులాగే
ఈ ప్రపంచమంతా ఏడుస్తోంది వారిబాధలకు
నేను నా హృదయపూర్వకంగా
నిన్ను పిలుస్తున్నా!
నిన్నుగానక నేనెక్కడికీ వెళ్ళనుప్రభూ!
నీవులేక నేను సంపూర్ణమెలా అవుతాను?
ఉన్నావు...ఉన్నావు...
అని అంతా అంటున్నారు కదా!
మరి రావేం?
కనబడవేం?
నీ మహిమ చూపవేం?
నా ఆర్తి తీర్చవేం?
అలనాడు గజేంద్రుని రక్షించ
ఎలా పరుగెత్తి వచ్చావో అలా!
నీకోసం ఎదురుచూస్తా ఎంతకాలమైనా
అందుకే నీకీ ఉత్తరం రాసి పోస్టు చేస్తున్నా సుమా!
**************************************
ఎక్కడున్నావు తండ్రీ!
ఎక్కడని నీకోసం వెతకను?
నీవులేక నేనెలా మనగలను?
నీవేనాకు ఒకప్పుడు ఉపదేశించావు
ఆమార్గంలోనే నేను నడుస్తున్నాను
అయినా అడుగడుగునా సందేహమే
మరి ఇది ముళ్ళునిండిన దారిలా ఉంది
ఊ...హూ...
నే నెవరిమాటా వినను
నీవు చెప్పినట్లే నడుస్తా
అయినా....
నేనేంచేయనయ్యా!?
నా విశ్వాసం అంత బలంగాలేదు
నా మనస్సంతా చీకటే
నాకులాగే
ఈ ప్రపంచమంతా ఏడుస్తోంది వారిబాధలకు
నేను నా హృదయపూర్వకంగా
నిన్ను పిలుస్తున్నా!
నిన్నుగానక నేనెక్కడికీ వెళ్ళనుప్రభూ!
నీవులేక నేను సంపూర్ణమెలా అవుతాను?
ఉన్నావు...ఉన్నావు...
అని అంతా అంటున్నారు కదా!
మరి రావేం?
కనబడవేం?
నీ మహిమ చూపవేం?
నా ఆర్తి తీర్చవేం?
అలనాడు గజేంద్రుని రక్షించ
ఎలా పరుగెత్తి వచ్చావో అలా!
నీకోసం ఎదురుచూస్తా ఎంతకాలమైనా
అందుకే నీకీ ఉత్తరం రాసి పోస్టు చేస్తున్నా సుమా!
**************************************
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి