జవహర్ బాల భవన్...ఒక జ్ఞాపకం...2;- ప్రమోద్ ఆవంచ- 7013272452

 సాయంత్రం నాలుగు గంటలు నల్గొండ బస్టాండ్ కి కూత దూరంలో ఉన్న జవహర్ బాల భవన్  గేటు తెరుచుకుంటుంది.పిల్లలు బిల బిలమంటూ లోపలికి ప్రవేశి‌స్తారు.బాల భవన్ ముందు విశాలమైన మైదానం, గేటునానుకొని భవనం ఉంటుంది.రోడ్డు వైపు
మహిళలకు,పిల్లలకు సంబంధించిన ఒక గ్రంధాలయం ఉండేది.ఆ గ్రంధాలయంలో లైబ్రేరియన్ గా వీరమణి గారు పనిచేసేవారు.గేటు లోపల బాల భవన్ భవనం దాటిన తర్వాత పిల్లలు ఆడుకునేందుకు ఉయ్యాలలు, జారుడుబండలు... ఎన్నో ఉండేవి.పిల్లలతో ఆ ప్రదేశమంతా కోలాహలంగా,గొడవ గొడవగా అత్యంత ఉత్సాహంగా ఉండేది.ప్రదాన ద్వారం గుండా లోపలికి వెళితే పెద్ద హాలు ఉండేది.ఆ హాలులో కుర్చీలు,టేబుల్స్లాం టివి లేకుండా ఒక తివాచీ పరచి ఉండేది.అక్కడే కొంత మంది పిల్లలకు కింద కూర్చోనే గురువు గారు నాగార్జున రామ్మూర్తి డ్రాయింగ్ నేర్పించేవారు.పందొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరంలో నేనూ ఆయన శిష్యుడనే.రామ్మూర్తి గారు గీతా విజ్ఞాన మందిర్ స్కూలు లో పని చేసేవారు.కొంతకాలం తరువాత ఆయన మానేసిన సమయంలో నాగార్జున సాగర్ నుంచి డిప్యుటేషన్ మీద దాసి సినిమా నేషనల్ అవార్డు గ్రహీత సుదర్శన్ గారు బాల భవన్ కి వచ్చారు.ఆయన దగ్గర కూడా నేను చాలా స్వల్ప కాలం డ్రాయింగ్ నేర్చుకున్నాను.ఆ తరువాత కొద్ది రోజులకే ఆయనకు ఇక్కడి వాతావరణం నచ్చక మళ్ళీ నాగార్జున సాగర్ కు
వెళ్ళిపోయారు.రామ్మూర్తి గారు కూడా చనిపోయినట్టు సమాచారం.ఎవరూ లేని సమయంలో పిల్లలకు సూపరింటెండెంట్ గా ఉన్న గురువు గారు కనకాచారి సార్డ్రాయింగ్ నేర్పించే వారు.ఈయన సకల కళా వల్లభుడు అన్ని ఇన్స్ట్రుమెంట్స్ అద్భుతంగా వాయిస్తారు.
చిత్రలేఖనంలో కూడా చెయి తిరిగిన కళాకారుడు.మంచి గాత్రం, నాటకాలు రాయడం, వాటిని పిల్లలతో ప్రదర్శనలు ఇప్పించడం...ఇలా ఎన్నో పనులను ఒంటి చేతితో అవలీలగా చేసేవారు....ఆ తరువాత రోజుల్లో నాగార్జున రావు అనే డ్రాయింగ్ టీచర్ బాల భవన్ లో పనిచేసినట్లు, ఆయన సూపరింటెండెంట్ గా కూడా ఉన్నట్లు సమాచారం.
అదే హాలులో ఒక మూల గురువు గారు మంద కృష్ణ రామ ప్రసాద్ మృదంగం నేర్పించేవారు. శ్రీకాకుళం నుంచి వచ్చారు.ఆయన ఇక్కడున్నప్పుడే బరంపురం చెందిన గాయత్రి గారిని వివాహం చేసుకున్నారు.ఆమె వయోలిన్ విద్వాంసుకురాలు. నల్గొండలో ఉన్నన్ని రోజులు సూరి గారితో కలిసి బాల భవన్ లో పిల్లలకు వయోలిన్ నేర్పించేది.ప్రసాద్ గారి శిష్యరికంలో జాతీయ, అంతర్జాతీయ ఎదిగిన విద్యార్ర ఘునందన్.ఆ తరువాత రోజుల్లో రఘునందన్ మ్యూజిక్ లో మాస్టర్స్ డిగ్రీ చేసాడు.సంవత్సరంలో ఆరు నెలలు విదేశాల్లో ప్రదర్శనలు ఇస్తుంటాడు.తనకు మృదంగంలో అక్షరాలు నేర్పిన ప్రసాద్ గారిని, నల్గొండ బాల భవన్ ను ఇప్పటికీ మర్చిపోలేదు.అంతటి గురు భక్తి ని కలిగివున్నాడు.రఘునందన్ తో పాటు రామానుజాచార్యులు,కృష్ణమాచారి ఆయన  రామగిరి దేవాలయం ఎదురుగా ఉన్న చారి సార్ కొడుకు.చారి సార్ మా నాన్న ఆవంచ సీతారామారావు గారికి ప్రియ మిత్రుడు.ఇంకో అతను ముదిగొండ సాయిబాబా, అడ్వకేట్ కొలనుపాక మురళీధర్ రావు గారి కొడుకు ఉదయ్,దాసోజు శ్రవణ్ తమ్ముడు రవిచందర్, ప్రస్తుతం
నల్గొండ టౌనులో టాక్స్ కన్సల్టెంట్ కొనసాగుతున్న కృష్ణ మోహన్.కృష్ణమోహన్ బాల భవన్ వచ్చి నేర్చుకోలేదు.గురువుగారు ప్రసాద్ గారి ఇంటి దగ్గర నేర్చుకున్నట్లుతెలిసింది.కృష్ట రామ ప్రసాద్ గారు కొంతకాలం తర్వాతశ్రీకాకుళం వెళ్ళిపోవడం అక్కడ వేల మంది విద్యార్థులకుమృదంగం నేర్పించడం జరిగింది.ఆయనకు ఒక కుమార్తె.ఆమె కూడా మృదంగంలో తండ్రికి తగ్గ తనయ.ఆ అమ్మాయి ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్నట్లు తెలిసింది.ప్రసాద్ గారు మూడేళ్ల క్రితం చనిపోయారు.
వయోలిన్ విద్వాంసుడు ఎం.వి.సుబ్రమణ్య సూరి గారు ఈయన శ్రీరామ చంద్ర మూర్తి గారిని పెదనాన్న అని పిలిచేవారు.మూర్తి గారింట్లోనే ఉంటూ, బాల భవన్ పిల్లలకు వయోలిన్ నేర్పించే వారు.ఆయన దగ్గర వయోలిన్ నేర్చుకున్న వారిలో నేనూ ఉన్నాను.
నాతో పాటు శ్రీనివాస్ రెడ్డి, కొలనుపాక మురళీధర్ రావు గారి కూతురు శ్రీమతి కోమలి ఉన్నారు.మిగితా వాళ్ళు జ్ఞాపకం రావడం లేదు.సూరీ గారికి బాల భవన్ లో పని చేస్తున్నప్పుడే గవర్నమెంట్ జాబ్ వచ్చింది.ఆ తరువాత రోజుల్లో గురువు గారు కనకాచారి గారి తర్వాత సూరి గారు సూపరింటెండెంట్ బాధ్యతలు స్వీకరించారు. అప్పట్లో ఆయన నల్గొండ కలెక్టర్ కి,ఇతర ఉన్నతాధికారులకు వయోలిన్ నేర్పించేవారు.ఆయనకుఆల్ ఇండియా రేడియోలో అవకాశం రావడంతో రిటైర్డ్అయ్యేంత వరకు అక్కడే పనిచేసినట్లు తెలిసింది.ఆయన గురించి వాకబు చేసినా కనీసం ఆయన ఫోన్ నెంబర్ కూడా దొరకలేదు.గురువు గారు ఎక్కడున్నా బాగుండాలని కోరుకునే వాళ్ళల్లో నేనూ ఉంటాను.
                 గోవర్ధన వెంకట రామానుజాచార్యులు.....ఆయన  రామగిరి బాలికల పాఠశాలలో మ్యూజిక్ టీచర్ గా పనిచేసేవారు.సాయంత్రం బాల భవన్ లో పిల్లలకుగాత్ర సంగీతం నేర్పించేవారు.ఈయన ప్రస్తుతం ఎక్కడ ఉన్నారో తెలియదు.కూచిపూడి నుంచి వచ్చిన పసుమర్తి సూర్యనారాయణ గారు ఆయన కుమారుడు.. ఇద్దరూ బాల భవన్ లో పిల్లలకు కూచిపూడి నృత్యం నేర్పించేవారు.ఆ తర్వాత కొద్ది రోజులకు వాళ్ళు వారిస్వస్థలానికి వెళ్లిపోయినట్లు తెలిసింది.మేడం జెరూషా రాణి క్రాఫ్ట్స్,టైలరింగ్ టీచర్ గా పనిచేసేవారు.మేడం వాళ్ళ నాన్న గారు చిలుకా జోసెఫ్ ఈయన హుజూర్ నగర్ స్కూలులో టీచర్ గా పనిచేసేవారు.ఆయనకు గీతా విజ్ఞాన సమితి సభ్యులు విద్యావేత్త చిన వెంకట్ రెడ్డి మిత్రుడు.ఆయన చెపితే శ్రీరామ చంద్ర మూర్తి గారు జరూషా రాణి గారిని టైలరింగ్ టీచర్ గా బాల భవన్ లో
నియమించారు.బాలభవన్ నుంచి బస్టాండ్ వెళ్ళే దారిలో విమెన్ వెల్ఫేర్ డెవలప్మెంట్ అథారిటీ ఆద్వర్యంలో అనాధ బాలికల కోసం బాల సధన్ నడిచేది.ఆ బాల సధన్ ఉండే బాలికలు టైలరింగ్, అల్లికలు నేర్చుకునేందుకు వచ్చేవారు.అలా ఎంతో మంది బాల
బాలికలను జరూషా రాణి గారు ట్రైన్ చేసారు.చాలా మందికి అది జీవనోపాధిగా మారింది.
                  అప్పట్లో బాల భవన్ తొమ్మిది వందల మంది విద్యార్థులతో కళ కళలాడుతూ ఉండేది.కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ,పిల్లలలో టాలెంట్ గుర్తించి అటు పిల్లల తల్లిదండ్రులతో ఇటు పాఠాలు చెప్పే గురువులను సమన్వయం చేసుకుంటూ డెబ్భై తొమ్మిది నుంచి ఎనభై తొమ్మిది వరకు ఒక దశాబ్ద కాలం పాటుఇద్దరు వ్యక్తులు బాల భవన్ ను నిరాఘాటంగా నిర్వహించారు.ఆ ఇద్దరిలో ఒకరు శ్రీరామ చంద్ర మూర్తి గారు, మరొకరు కనకచారి గారు.బాల భవన్ కి ఒకరు వైస్ చైర్మన్, ఒకరు సూపరింటెండెంట్.శ్రీరామ చంద్ర మూర్తి గారు నాగార్జున డిగ్రీ కళాశాలలో ఇంగ్లీష్ లెక్చరర్.ఆయన  గీతా విజ్ఞాన సమితిలో వ్యవస్థాపక సభ్యులు,ఆయనతోపాటు పట్టణంలో ప్రముఖ వ్యక్తులు కూడా ఈ సమితిలో సభ్యులుగా ఉన్నారు.గీతా విజ్ఞాన సమితి ఆధ్వర్యంలో జవహర్ భారతి అనే ఒక ప్రైమరీ స్కూలు,గీతా విజ్ఞాన మందిర్ హైస్కూలు, సాయంత్రం డీఓఎల్,బీఓఎల్   కళాశాల నడుస్తుండేవి.అదే ప్రెమిసెస్ లో మ్యూజిక్ కళాశాల నడపాలన్న కోరిక శ్రీరామ చంద్ర మూర్తి గారికి ఉండేది.కానీ అది నెరవేరలేదు.ఇటీవల కాలంలో గీతా విజ్ఞాన స్కూలును గవర్నమెంట్ కలిపేస్తున్నారన్న వార్త పూర్వ విద్యార్ధులను బాధ పడేలా చేసింది.ఈ మధ్య కాలంలో ఆ స్కూలుకు భూమిని డొనేట్ చేసిన దాసరి నారాయణ రెడ్డి గారి కూతురు యూఎస్ నుంచి నల్గొండకు వచ్చింది.ఆమె ఇక్కడ ఉన్న మూడు నెలల్లోగీతా విజ్ఞాన స్కూలును గవర్నమెంట్ కలపకుండా ఆపేయగలిగింది.ఇది శుభ పరిణామం.పందొమ్మిది వందల ఎనభై మూడు మూడవ సంవత్సరంలో మే నెల 10వ తేదీ నుంచి 24 వ తేదీ వరకు జవహర్ భారతి స్కూలు లో నేటి యువతరానికై వేసవి శిబిరం అనే పేరుతో ఒక క్యాంపు నిర్వ హించారు.ఈ వేసవి శిబిరం లో చిత్రలేఖనం,వివిధ వాయిద్యాలలో శిక్షణ, ప్రాతఃకాలంలోసూర్యనమస్కారాలు, యోగాతో మొదలైయ్యే రోజు, గొప్ప వ్యక్తుల పరిచయాలు, వాళ్ళు రోజూ ఏదో ఒక అంశంపై మాట్లాడుతుండేవాళ్ళు తెలుగు విశ్వవిద్యాలయం శిల్పకళ ఆచార్యులు బ్రహ్మచారి గారుమమ్మల్ని పానగల్ ఛాయా సోమేశ్వర ఆలయానికి తీసుకెళ్ళి అక్కడ ఉన్న శిల్పాలు, శిలాశాసనాల గురించి వివరించారు.ఆ తరువాత నాగార్జునసాగర్ కు వెళ్లి అక్కడ నాగార్జున కొండపై బౌద్ధ శిల్పాలను చూపించి, వాటి చరిత్ర నుతెలియజేసారు.ఆ పద్నాలుగు రోజుల క్యాంప్ లో ఎంతో నేర్చుకున్నాం....కట్ చేస్తే......శ్రీరామ చంద్ర మూర్తి గారికి గద్వాలకి ట్రాన్స్ఫర్ అయింది.ఆయన వెళ్ళిపోయారు.రిటైర్ అయ్యాక ఆయన హైదరాబాద్ లో స్థిర పడి అక్కడే కన్ను మూశారు.కనకాచారి సార్ కూడా సూపరింటెండెంట్ భాద్యతల నుంచి తప్పుకున్నాక, లెక్చరర్ గా ప్రమోషన్ వచ్చి వివిధ ప్రాంతాల్లో పని చేసి రిటైర్ అయ్యారు.ప్రస్తుతం ఆయన  సాహిత్య సేవలో నిమగ్నమై ఉన్నారు.ఆ తరువాత సుబ్రహ్మణ్య సూరి గారు కొంత కాలం ఆ భాద్యతలను నిర్వహించారు.ఆ తరువాత డ్రాయింగ్ టీచర్ నాగార్జున రావు,ఆ తర్వాత అటెండర్ నర్సయ్య కుమారుడు డిగ్రీ పూర్తి చేసి ఉండడంతో ఆయన కొంత కాలం భాద్యతలను భుజం మీద వేసుకున్నాడు.అతను అనారోగ్య కారణంగా చనిపోయినట్లు తెలిసింది.ప్రస్తుతం నల్గొండ బాల భవన్
ను నాగార్జునసాగర్ బాల భవన్ లో మెర్జ్ చేసారు.ఈ రెండు బాల భవన్ల భాద్యతలను పాలబిందెల బాలు అనే అతను నిర్వహిస్తున్నాడు.కానీ నాకు తెలిసీ నల్గొండ బాలభవన్ లో ఎలాంటి ఆక్టివిటీస్ జరగడం లేదు. శిధిలావస్థలో ఉన్న బాల భవన్ ను పునరుద్ధరించే విషయంలో  జిల్లా మంత్రులు, కలెక్టర్,ఇతర అధికారులుముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని పుర జనులు అభిప్రాయ పడుతున్నారు....
కామెంట్‌లు