కదంబం ;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 ఈ భూమి మీద పుట్టిన ప్రతి ప్రాణి సుఖాన్ని ఆనందాన్ని అనుభవించాలని కోరుతుంది  అయితే దాని మార్గాలు ఏమిటి అని అన్వేషిస్తే  ఏదైనా ఒక మంచి పాట అది సినిమా పాట కావచ్చు  శాస్త్రీయ సంగీతంలో  మంచి కీర్తన అయి ఉండవచ్చు  అది వింటున్నంతసేపు మనకు ఎంతో  మానసిక తృప్తి శాంతి కలుగుతుంది  అయితే ఆ తృప్తి ఎంతసేపు ఉంటుంది అంటే   ఆ పాట పూర్తి అయ్యేంతవరకు ఐదు నిమిషాలు కావచ్చు  అలాగే ఒక సినిమా చూస్తున్నామ్ అనుకోండి  దానిలో సంఘటనలు కానీ  సన్నివేశాలు కానీ మనల్ని  ఆ స్థితికి తీసుకు వెళ్ళిపోతాయి  ఆ సుఖాన్ని అనుభవించేది మనం రెండున్నర నుంచి మూడు గంటల వరకు మాత్రమే  ఆ తర్వాత ఆ సినిమా గురించి ముచ్చడించుకోవడం తప్ప ఆనందం దొరకదు.మనం కాలేజీలో చదవడానికి వెళ్ళినప్పుడు  దాదాపు మూడు సంవత్సరాలు మనం తీసుకున్న  విభాగాన్ని బట్టి  ఉంటుంది  ఆ చదవడం మూడు సంవత్సరాలు  విద్యార్థి దశ ఎంత ఆనందాన్ని కలిగిస్తుందో అప్పుడు తెలుస్తుంది  తన తోటి విద్యార్థులతో కలిసే నాటకాలాడినా పాటలు పాడినా బజారులో తిరుగుతూ కబుర్లు చెప్పుకుంటూ ఉన్నా  ఆడుతున్నా ఆ ఆనందం వేరు  దీని కాల పరిమితి మూడు సంవత్సరాలు మాత్రమే  అలాగే మనకి ఏదైనా స్నేహితుడు దొరికినప్పుడు  అతని అవసరాలు తీర్చుకోవడానికి వస్తాడు  అవసరం తిరగానే వెళ్ళిపోతాడు అది క్షణికం మాత్రమే  కానీ మిత్రుడు దొరకడం అనేది ఒక అదృష్టం  మన మనసు తెలిసి మసలుకొనే వ్యక్తి దొరకడం  అరుదుగా వచ్చే అవకాశం  ఆ వచ్చింది జీవితాంతం మనకు ఆనందాన్ని కలగజేస్తూ ఉంటుంది. బుచ్చిమంతుడైన  ఆంజనేయ స్వామి గురించి పరాశరసంహిత  పూర్తి సమాచారాన్ని ఇచ్చింది  దానిలో ఉన్న కొన్ని విషయాలను శ్రీరామారావు గారు మనకు అందించారు  ఆ విషయాలను క్లుప్తంగా తెలియజేసే ప్రయత్నం చేద్దాం  అంజనాదేవికి వాయుదేవుని వరం వల్ల పుట్టిన వాడు హనుమంతుడు  హనుమ పుట్టడానికి కారణం శివ పార్వతులు అగ్ని వాయువులు కారకులు హనుమంతుని గురువు సూర్య భగవానుడు  సూర్య భగవానుని సంచారం ఆగకుండా వారి వెంటే వెళ్లి విద్యను నేర్చుకున్నాడు అంత వేగంగా వెళ్ళగలిగిన  వాయు శక్తి తండ్రి నుంచి సంకల్పించింది అని చెప్తారు  హనుమంతుల వారిని భృగు మహర్షి శిష్యులు శపించారు అని ఒక కథ ఉంది వారు శపించడంలో కూడా పరమార్ధం ఉంది.

కామెంట్‌లు