కదంబం ;- -డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 భుక్త్వాత్ శతపదగచ్చేత్  అనే సంస్కృతంలో ఒక శ్లోకం  మనం భోజనం చేసిన తర్వాత  100 అడుగులు నడిచి తీరాలి  అదే ఆంగ్లంలో  ఆ దేశపు చెప్పుకునేది ఏమిటంటే వాక్ యే మైల్ ఆఫ్టర్ యే మీల్ భోజనం చేసిన తర్వాత  ఒక మైలు దూరం నడవాలి అంటారు వాళ్ళు  మనం ఉదయం గాని సాయంత్రం గాని  నడకను అభ్యసించినట్లయితే  ఆ వ్యక్తి  ఆరోగ్యానికి ఎలాంటి డొకా ఉండదు  ప్రతిరోజు పదివేల అడుగులు కనీసం నడవాలి అని మన పెద్దలు చెప్తారు ఈ నడక ఆరోగ్యానికి ఎంతో మంచిది  దీనివల్ల శరీరంలో రక్తప్రసరణ  సరైన పద్ధతిలో ఉంటుంది  ఎలాంటి రుగ్మతలు రావడానికి అవకాశం లేదు  నడిచేటప్పుడు  చెమట పట్టేట్టు నడవాలి  అప్పుడు శరీరంలో ఉన్న అనవసర మలినాలు అన్నీ బయటకు వెళ్లిపోతాయి. ఉప్పులేని పప్పు  అని మన పెద్దవాడు చెప్పుతూ ఉంటారు మన ఆహారంలో ప్రత్యేకించి ఆంధ్రులకు ఉప్పు ప్రత్యేకం  ఉప్పు లేకుంటే మజ్జిగ అన్నం తినలేదు  కూరలలో ఉప్పు తక్కువైనా గానీ  తినలేము  మోతాధుని మించి ఉన్న అది ఉప్పు కషాయం అని అంటా ఈ రెండు రకాల భోజనాలు మనం చేయలేం  అందువల్ల అయోడిన్ సాల్ట్ వాడడం వల్ల అనేక అర్థాలు ఉన్నాయి  నేను అది వాడను అనుకునేవారు  సైంధవ లవణం  ఆయుర్వేద వైద్యులు ఎక్కువగా వాడుతూ ఉంటారు  అది మన అంగడిలో  దొరికే వస్తువే  కనుక దానిని తెచ్చుకొని మామూలు ఉప్పు బదులు అది వాడినట్లయితే  బీపీ లాంటి లక్షణాలు  రాకుండా ఉంటాయి  అంతకు ముందు ఉన్న బిపి  ఉదృతాన్ని తగ్గిస్తుంది. మన పెద్దవాళ్లు  నూనె పదార్థాలు చేస్తే ఎంతో కమ్మగా రుచికరంగా  రెండు ముద్దులు తినగలిగినవాడు నాలుగు ముచ్చట తింటాడు  దానికి కారణం వారు వాడే నూనె పదార్థాలు  మన   హయాం వచ్చేసరికి  రిఫైండ్ ఆయిల్  వంటలు  వాడే సంస్కృతి ప్రారంభమైంది  దానిని వదిలి నెయ్యి కానీ నువ్వుల నూనె గాని వేరుశనగ నూనె కానీ  కుసుమ నూనె అని కొత్తగా వస్తోంది దానిని కానీ  వాడి ఆరోగ్యాలను  కాపాడుకోవడం చాలా మంచిది  రాత్రి దది (పెరుగు) భోజనం ఆయుషును తగ్గిస్తుంది అని సంస్కృత శ్లోకం లో చెప్తారు  రాత్రిపూట  పెరుగుతో భోజనం చేయకూడదు మరి దేనితో చేయాలి  రాత్రిపూట పాలు అన్నం తిన్నట్లయితే ఆరోగ్యం రోజూ పెరుగుతూ ఉంటుంది  ఆయుషు కూడా అంతే.

కామెంట్‌లు