తల్లి పిల్లలకు చెప్పవలసిన కొన్ని మంచి మాటలు ఏమిటంటే మనిషికి ఆత్మ ఉండాలి అన్నది స్పష్టంగా చెప్పాలి అది ఎప్పుడైతే పిల్లలలో వృద్ధి చెందిందో అతని స్థితిని ఉన్నత స్థాయిలో నిలబెడుతుంది దానికి వ్యతిరేకంగా అహంకారం పెరిగితే తన కులాన్ని చూసి ఆస్తిని చూసి తన గొప్పతనాన్ని చూసి విర్రవీగనట్లయితే ఆ వ్యక్తిని ఎంత దిగజార్చాలో అంతా దిగజారిస్తుంది ప్రకృతి మనకు గురువులు అంటే పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు పంతులు అని అనుకుంటాం జీవితం కాలం ఈ రెండూ కూడా మనకు గొప్ప గురువులే కాలాన్ని ఎలా ఉపయోగించుకోవాలి జీవితం చెప్తుంది జీవితం ఎంత విలువ అయిందో కాలం చెప్తుంది అందుకే కొన్నిటిని మర్చిపోవాలి కొన్నిటిని మార్చుకోవాలి కొన్నిటిని వద్దనుకోవాలి అప్పుడే బ్రతుకు బాగుంటుంది అని మన పెద్దల సూక్తి. అందుకే మన పెద్దలు నీటిని జాగ్రత్త పడుకోమని చెప్పడానికి చక్కటి ఉదాహరణ చెప్పారు మాటను పొదుపు చేసుకో ఎక్కడ ఎవరితో ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడితే ఎలాంటి తగాదాలు రావు మాటకు మాట తెగులు అనేది ఒక సామెత నీవు ఒక మాట అంటే ఎదుటివారు మరో రెండు మాటలు అనడానికి అవకాశం ఇవ్వవద్దు. అది నీకు మేలు జరుగుతుంది నీకు మేలు జరిగింది అంటే మీ మనసు ఎంతో ఆనందంగా సుఖంగా ప్రశాంతంగా ఉంటుంది అలాగే నీవు సంపాదించిన ధనాన్ని ఇది నాది కదా నా కష్టార్జితం నేను ఖర్చు చేయకూడదా అంటూ ఈ చివర నుంచి ఆ చివర వరకు కంటికి కనిపించిన ప్రతి వస్తువును కొని సంపాదన మొత్తం ఖర్చు చేయవద్దు అలా ఖర్చు చేస్తే నీ ఒక్కడి స్వార్థం అవుతుంది. అదే నీవు పొదుపు చేశావు అనుకో నీ పిల్లలకి ఎంతో మేలు జరుగుతుంది అలాగే నీటిని ఎక్కడపడితే అక్కడ వృధా చేయకుండా అనవసరంగా ప్రతిదానికి వాడకుండా ఎంతవరకు అవసరమో అంతవరకే వాడినట్లయితే ఆ నీటి పొదుపు జగతికి మేలు జరుగుతుంది తల్లిదండ్రులకు ఒక బిడ్డ పుట్టాడు అంటే ఆ తల్లిదండ్రులు ఆనందపడాలి ఆ ఆనందాన్ని దుఃఖంగా మార్చే పనులను చేయవద్దు అని చెప్పడం మనం సమాజంలో జీవిస్తున్నాం అన్న విషయాన్ని జ్ఞాపకం పెట్టుకుని మన బ్రతుకులో మనం చేస్తున్న ప్రతి పనిని సక్రమంగా క్రమశిక్షణతో చేసినట్లయితే నీతో పాటు మరికొంతమంది అనుసరించడం కూడా జరుగుతుంది దానితో ఈ సమాజం నిన్ను చూసి సంబరపడిపోతుంది.
కదంబం;- డా. నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు-6302811961.
• T. VEDANTA SURY
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి