భగవంతునికి అతి దగ్గరగా భక్తులు చేరే ప్రత్యేకమైన రోజులే పర్వదినాలు అలా మన తెలుగువారికి ఒక్కో పండుగ ఒక్కో ప్రత్యేకతను చాటుతాయి సంస్కృతిని ప్రతిబింబిస్తాయి సాంప్రదాయాలను ఆచారాలను కొనసాగడానికి ఆచరించడానికి పండుగలు ఎంతో ప్రాశస్తిని కలిగి ఉంటాయి. పండుగల యొక్క ప్రాముఖ్యత గూర్చి శాస్త్రాలు, పురాణాలు, వేదాలు,చెబుతాయి. అలా ఋషులు కాలాన్ని విభాగం చేశారు.
అలా విభాగం చేసినట్టి భాగంలో రోజు, పక్షము, మాసము,వారము, సంవత్సరము, ఆయనము, పగలు, రాత్రి, గంట, అరగంట, నిమిషము, యామము, ఇలా ఎన్నో విభాగాలు ఉన్నాయి. అందులో సంవత్సరం ఒక ప్రధానమైనటువంటి ప్రమాణము. సంవత్సరం మూడువందల అరవై అయిదు రోజులతో పన్నెండు మాసాలతో కూడి ఉంటుంది.
అలా మన తెలుగు వారందరం చాంద్రమానాన్ని అనుసరిస్తాం అలా మనకు మొత్తం అరవై సంవత్సరాలు ఉంటాయి. ఈ అరవై సంవత్సరాలు మళ్ళీ వృత్తంగా తిరుగుతుంటాయి.
అందులో మొట్టమొదటి మాసం అయిన చైత్రమాసంలో మొట్టమొదటి పక్షం అయిన శుక్లపక్షంలో వచ్చేటటువంటి మొట్టమొదటి తిథి అయిన త పాడ్యమి తిధి నాడు మొట్టమొదటి తెలుగు నూతన సంవత్సరం ప్రారంభం అవుతుంది. అలా
అనుసరించి కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది. వసంత ఋుతువు ప్రారంభమై చెట్లని కొత్త చిగుళ్ళతో పూలతో, కాయలతో, శోభిస్తాయి. వసుధ కొత్త అందాలను సంతరించుకొని చూడటానికి ఏంతో నయనానందకరంగా ఉంటుంది. మనసుకు పరవశాన్ని కలిగిస్తుంది.
శిశిరాన్ని విదిల్చిన ప్రకృతి వసంతాన్ని వరించిన శుభదినముగా పరిగణిస్తారు
ఆ శుభ సందర్భంగా చాంద్రమానాన్ని అనుసరించి మన తెలుగు వారందరు కొత్త సంవత్సరం ప్రారంభ సందర్భంగా జరుపుకునే పండుగే ఉగాది. ఉగాది రోజున బ్రహ్మ సృష్టిని ప్రారంభించాడట ఆ నమ్మకం ఆధారంగానే ఈ రోజును ఉగాది అని పిలుస్తారు. ఉగాది అనగా యుగాది ఆది అని అదే ఉగాదిగా మారింది.
మన గ్రంధాలలో వివరించిన ప్రకారం మనకు ఒక సంవత్సరం గడిస్తే అది బ్రహ్మకు ఒక రోజు అలా మన ప్రతి ఉగాదితో బ్రహ్మకు ఒక రోజు ప్రారంభం అవుతుంది.
పురాణ గాధ ఏమిటంటే సోమకాసుర రాక్షసుడు బ్రహ్మ వద్ద నుంచి వేదాలు దొంగిలించి సముద్రంలో దాక్కునప్పుడు విష్ణుమూర్తి మత్స్య అవతారం ఎత్తి ఆ రాక్షసుల్ని సంహరించి వేదాలను బ్రహ్మకు అప్పగించింది. చైత్ర శుద్ధ పాడ్యమి రోజే ఆ వేదాలను పొందిన బ్రహ్మ ఆ రోజు సృష్టి చేయడం ప్రారంభిండట
పురాణాలను పరిశీలిస్తే ఉగాది పండుగను చేసుకోవడం మహాభారత కాలం నుండి కూడా చేసుకున్నారు.( అమలులో ఉంది) అని మనకు తెలుస్తుంది. అది ప్రస్తుతం మనం జరుపుకుంటున్నట్టు చైత్ర శుద్ధ పాడ్యమి రోజున కాకుండా మకర సంక్రాంతి తర్వాతి రోజు జరుపుకునే వారు పురాణాలలో ఉగాది ప్రస్తావన తక్కువగా ఉన్నప్పటికీ చైత్ర శుద్ధ పాడ్యమికి మాత్రం చాలా ప్రాధాన్య. ఉంది. వసంత రుతువు ఆగమనానికి సూచన కావడమే కాక చైత్రమాసం ప్రారంభమైన తొలి రోజుగా ఆనాటి ప్రజలు భావించేవారు అనటానికి ఎన్నో ఆధారాలున్నాయి. ఉగాది పండుగను మనమే కాకుండా మహారాష్ట్ర, పంజాబ్, కేరళ, అస్సాం లో కూడా చేసుకుంటారు. కాకపోతే మనం చాంద్రామానాన్ని అనుసరించి ఈ పండుగను చేసుకుంటాం. మిగతా రాష్ట్రాలలో సౌరమానాన్ని అనుసరిస్తారు. పంజాబ్లో "వైశాఖి "అని మహారాష్ట్రలో "గుడి పదవ", అని అస్సాంలో "విరు," కేరళలో "కొల్ల వర్షం", అనే పేర్లతో ఈ పండుగను జరుపుకుంటారు. ఉగాది రోజున ఉదయానికి పూర్వమే అంటే బ్రహ్మీ ముహూర్తంలో నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని ఉన్న పెద్దవారి చేత తైలం పెట్టించుకుని (నువ్వుల నూనె) ప్రధమాయములోనే సుండి పిండితో అభ్యంగన స్నానమాచరించి. అంచు గల నూతన వస్త్రాలను ధరించి, పెద్దవారి చేత ఆశీర్వాదం తీసుకోవాలి.
ఇంటిని గుమ్మాన్ని అందంగా అలంకరించి. పచ్చని మామిడి తోరణాలు కట్టి పూలతో అలంకరించి ఇంటి ముంగిట వాకిలిలో రంగురంగుల రంగవల్లులు తీర్చిదిద్ది వేప పూత, పచ్చి మామిడి ముక్కలు, కొత్త చింతపండు, బెల్లము, ఉప్పు, కారం కలిపిన ఆరు రుచులు కలసిన ఉగాది పచ్చడిని భగవంతునికి నివేదన చేసి తర్వాత కుటుంబ సభ్యులంతా సేవిస్తారు. కష్టాలు సుఖాలు, బాధలు, సంతోషాలు సమానంగా భావించి జీవన గమనాన్ని సాగించాలి. అనే పరమార్థం తెలియజేసేదే ఉగాది పచ్చడి ఇది ఉష్ణాన్ని తగ్గించి ఆరోగ్యాన్ని చేకూర్చుతుంది.
షడ్రుచుల మేళవించిన సమ్మేళనమే జీవితము అనే ఆంతర్యము కూడా ఈ ఉగాది పచ్చడిలో మనకు కనిపిస్తుంది. ఆలయానికి వెళ్లి
రాజ దర్శనం చేసుకోవడం మనదరి ఆనవాయితీ రాజదర్శనం అంటే భూమిని పరిపాలించే రాజులకు రాజు శివుడు శివాలయంలో పార్వతీ పరమేశ్వరుని దర్శనం చేయవచ్చు శివ కేశవలను కూడా దర్శించుకోవచ్చు ఈ రోజున గోప్రదక్షణ, గోపూజ, వృషభ పూజ, పంచాంగాన్ని పూజ మందిరంలో ఉంచి. పూజించి ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరి రాశి ఫలాలను చదువుకొని, ఏదైనా ఉపద్రవాలు ఉంటే తగిన జాగ్రత్తలు పాటిస్తూ అనుకున్న గమ్యాలను లక్ష్యాలను చేరుకోవడానికి పంచాంగ శ్రవణం సులభతరం అవుతుంది.
జీవన ప్రమాణాలలో ఒక సంవత్సరాది ముందుగా వచ్చే మార్పును ఖగోళ శాస్త్ర మార్పులను గ్రహించి జీవన మార్గాన్ని సులభతరం,సుఖతరం , చేయడానికి పంచాంగం ఎంతో ఉపయోగపడుతుంది. బ్రహ్మపురాణం ప్రకారం
పంచాంగం అంటే ఐదు అంగములు కలిగినది అని అర్థం. నక్షత్రం, కరణము, యోగము, సంవత్సర కాలాన్ని ప్రమాణం చేసుకొని ఆ కాలమందు గ్రహములు ఏలా కదులుతున్నాయో ఆ గ్రహములను ఏ ఫలితాలను ఇవ్వబోతున్నాయో
ఆయా నక్షత్రం నందు జన్మించినటువంటి పొందబోయేటి శుభా శుభ ఫలితాలు ఏలా ఉండబోతున్నాయో ఆదాయ, కంధాయ, వ్యయాలను ,రాజపూజ్యం అవమానం, ఇవన్నీ పంచాంగం ద్వారా తెలియజేయబడతాయి.
అలా వీటన్నిటిని పూజ చేయడం విశేష ఫలితాన్ని ఇస్తుంది.
కవి సమ్మేళనాలు కవితగోస్థి
వసంత రుతువు అంటే కవులకు ఎంతో ఇష్టం ఎందరో మహా కవులు వసంత రుతువు మీద ఎన్నో కవితలు రాశారు వారిని కవిత శక్తిని గుర్తు చేసుకుంటూ ఈనాటి కవులు అందరూ ఒకచోట చేరి తాము రాసిన కవితలను వినిపించడానికి కవి సమ్మేళనాన్ని ఏర్పాటు చేసి కవితలను వినిపిస్తారు. ఇది
ప్రతి ప్రధాన పట్టణాలలో కవి సమ్మేళనాలు నిర్వహిస్తారు.
ఉగాది రోజున కొత్త పనులను ప్రారంభిస్తారు.
తెలుగు జాతి సంస్కృతి, సాంప్రదాయమైనటువంటి కట్టు,బొట్టు, ఉట్టిపడేలా సంస్కృతి ప్రతిబింబిస్తుంది. ఈ పండుగలో అలాగే
వసంత నవరాత్రులు కూడా ప్రారంభం అవుతున్నాయి కాబట్టి వసంత రుతువు లక్ష్మీకారకం విసనకర్రలు, పానకము, మల్లెపూల దండలు, మామిడి పండ్లు, మజ్జిగ, గొడుగులు, చెప్పులు, ఇలా ఎవరి ఆర్థిక స్తోమతకు తగ్గట్టుగా వారు ఒక పది మందికి పంచడం ఉత్తమమైన పద్ధతి. అవసరం ఉన్నవారికి సహాయాన్ని అందించినట్టు అవుతుంది ఇచ్చిపుచ్చుకునే ధోరణి అలబడుతుంది. ఇలా చేయడం ద్వార ఈ సమయం లో ఎండల తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి బాటసారుల దాహార్తి తీర్చడానికి చలివేంద్రాలు కూడా ప్రారంభిస్తారు.మనకు కల్గినంతలో పదిమందికి పంచడమే పండగల యొక్క పరమార్థం.
ఋషులే కొత్త సంవత్సరం ప్రారంభమైనప్పుడు దానిని అనుష్టించి దానికి సంబంధమైనటువంటి ప్రయోజనాలను పొందటానికి కావలసినటువంటి రీతిని నిర్ణయించారు.కాబట్టి కొత్త సంవత్సరాది జరుపుకునేటప్పుడు ఇలా ఒక ప్రత్యేకమైనటువంటి విధానంలో జరుపుకోవాలి.
ఇలా పండుగలను భక్తిశ్రద్ధలతో ఆచరిస్తే సమాజానికి ఎంతో ఆనందం, ఆరోగ్యం, చైతన్యం, ఉత్సాహం, చేకూరుతాయి
దేశం, కుటుంబం, ప్రపంచం, సమాజం, తెలుగు నూతన సంవత్సరంలో మనందరం సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటూ తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి