ఆధ్యాత్మిక కంద పద్యాలు
*************************
కం
క్రోధావేశంబు విడచి
మాధవ సేవగ తలిచెడి మానవ జన్మన్
వేధన తొలగెడి పనులను
సాధన జేయంగమేలు సత్యము మనసా!
వాదన బోధగ మార్చుచు
రోదన కలిగించ బోక లోకహితముకై
మేదస్సుపయోగించుచు
భేదము లెరిగినను చాల విలువగు మనసా!
కాదని జెప్పక షడ్రుచి
చేదు పులుపు తీపివోలె జీవిత రథమున్
నీదగు జన్మకు మార్చెడి
పాదారంభమె నుగాది పండుగ మనసా!
నూతన వొరవడి నేర్పగ
నీతిని బోధించు గనుము నిశ్చలంబుగన్
వ్రాతను కొత్తగ తీర్చెడి
శీతల వత్సరము క్రోధి చెడువిడు మనసా!
క్రోధి యనే వత్సరమే
బాధలు తేదయ్య వినుము భార్గవి యనుచున్
శోధన జేయుచు వేడగ
శ్రీధరి పాదంబు లందు శీఘ్రమె మనసా!
దామోదర నీనామము
లేమని తెలిపెదము తండ్రి లీలలు గనగన్
రామా! జ్ఞానము నొసగుమ
పామర రూపులము దేవ పావన మూర్తీ..!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి