అన్ని దానాలు కెల్లా!
అవయవదానం మిన్నని
అందరూ తెలుసుకోవాలి!
ఆచరించగ రావాలి!
అవయవదానం అంటే
ప్రాణదానమే కదా!
అందువలన ఎందరివో
జీవితాలు నిలుచును కదా!
అవయవదానం ద్వారా!
చనిపోయిన పిదప కూడా
మనిషిని బతికించవచ్చు!
బ్రతుకులు వెలిగించవచ్చు!
ఊపిరితిత్తులు, గుండెను
మూత్రపిండాలు, కళ్ళును
దానంగా ఇవ్వవచ్చు!
జీవితాలు నిలపవచ్చు!
మూఢనమ్మకాలు వీడి!
అవయవదానం చేసి!
జీవన దాతలు కండీ!
బ్రతుకులును నిలపండీ!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి