పి శ్రీనివాసన్ అన్నగారు అవడానికి తమిళ్ అయినా తెలుగు అమ్మాయి సుభద్రమ్మ గారిని పెళ్లాడి తెలుగు కార్యక్రమాలను ఎంతో శ్రద్ధగా నిర్వహించిన వ్యక్తి ఎవరి నుంచి ఎలాంటి కార్యక్రమాన్ని రాబట్టాలో ఆయనకు తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదు అనడంలో అతిశయోక్తి లేదు ఆకాశవాణి సంచాలకుడిగా పదవీ విరమణ చేసేంతవరకు అజాతశత్రువు గానే మెలిగారు. ఆయన దగ్గర పనిచేసే అనేకమంది నిష్ణాతులయ్యారు వారిలోకే వెంకటేశ్వరరావు ఆర్ బి సుబ్రహ్మణ్యం, డి ప్రసాదరావు తదితరులు ఉన్నారు అటు వేదాల్లోనూ ఇటు సంగీతంలోనూ గొప్ప పండితుడైన నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యులు గారి నుంచి భారత రామాయణాలను ప్రజలలోకి తీసుకెళ్లిన ఉషశ్రీ వరకు అటు బందా కనక లింగేశ్వర రావు,రజనీ, ఆమంచర్ల గోపాలరావు హేతువాది జీవీ కృష్ణారావు లాంటి వారందరినీ సమన్వయ పరుచుకుంటూ కళాకారులందరినీ కుటుంబంలో ఒక తాటి మీద నడిపి చక్కటి కార్యక్రమాలను చేయించారు. తమిళంలో వితంతు వివాహానికి సంబంధించిన అరుణోదయం అన్న నాటకాన్ని వ్రాసి కృష్ణమాచార్యులు గారితో తెలుగులో అనువదింప చేసి నన్ను శ్రీరంగం గోపాల రత్నాన్ని ప్రధాన పాత్రలుగా ఎంచుకొని బందా వేమవరపు శ్రీధర్ రంగస్థలం మీద భీమునిగా ప్రసిద్ధులను కూడా భాగస్వాములను చేసి నండూరి సుబ్బారావు గారి దర్శకత్వంలో రూపొందించారు అది ఎంతగా ప్రాచుర్యం చెందిందో చెప్పనలవి కాదు విజయవాడ హైదరాబాద్ కడప కేంద్రాలతో పాటు మద్రాస్ కేంద్రం కూడా ఆ నాటకాన్ని ప్రసారం చేశారు ఆ నాటకం విని ప్రఖ్యాత సినీ రచయిత నటుడు ముదిగొండ లింగమూర్తిగారు ఉత్తరం కూడా నాకు రాస్తూ అభినందనలు తెలియ చెప్పడంతో పాటు ప్రత్యేకంగా విజయవాడ వచ్చినప్పుడు నన్ను కలిసి మా చిన్నారి గ్రే గ్రే కుమార్ నాకు,అరుణకు శుభాకాంక్షలు అందజేసి వెళ్లారు. ఆ రోజుల్లో బందాగారు కళాకారులను కూర్చోబెట్టి నాటకం మొత్తం చదివి ఆ తర్వాత ఎవరు ఏ పాత్ర నిర్వహించాలో ఆ పాత్ర వారికి ఇచ్చేవారు బందా గారికి నచ్చక లేకపోతే ఆ పాత్రను మార్చి మరొక చిన్న పాత్ర ఆయనతో చేయించేవారు అంతా ఒక కుటుంబంలో జరుగుతున్నట్లు ఉండేది ఎవరు భేషజాలకు పోయేవారు కాదు అదీ ఆనాటి వాతావరణం.
ఆకాశవాణి విజయవాడ కేంద్రం;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి