1965 వ సంవత్సరంలో ప్రధానమంత్రి సంక్షేమ నిధికి ధన సేకరణకు శ్రీకాకుళం నుంచి హైదరాబాదు వరకు జోలి పట్టి తిరిగి లక్షలు సేకరించి ప్రధానమంత్రి కి పంపిన వదాన్యుడు వెండితెర తెలుగు నందమూరి తారక రామారావు దేశానికి తాము ఏమి ఇవ్వాలి అని ఆలోచించి ఓ చిన్న నాటికను కదంబ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి లక్షలు వసూలు చేసి దేశానికి ఇచ్చారు ఆ సందర్భంగా విజయవాడ వచ్చినప్పుడు ఆకాశవాణి ప్రాంగణానికి మూడు గంటలకు వస్తానని చెప్పి ఖచ్చితంగా సమయపాలన చేసిన వ్యక్తి కథానాయికలు ఆడవారు కదా వారు ముస్తాబు అయ్యేసరికి సమయం అయిపోతుంది అని నేను ఒక్కడినే వచ్చాను. వారు తర్వాత వస్తారు అన్నారు దేవికను ఉద్దేశించి రామారావు గారిలో ఉన్న సంస్కారం సంప్రదాయాన్ని పాటించే నియమం కొద్ది మందికి మాత్రమే ఉంటుంది. వారికి ఎదురు వెళ్లి నేను వారిని తీసుకుని గౌరవంగా స్టూడియోలో ఉన్న బందా గారిని పరిచయం చేయగానే మీ గురించి మీ పౌరాణిక నాటకాలలో కృష్ణ పాత్ర గురించి శ్రీకృష్ణ పాత్ర ధరించిన నాటకం పూర్తికాగానే ప్రేక్షకుల కోసం మీరు పాడే గుత్తి వంకాయ కూర ఆ పాట గురించి వినడమే తప్ప మిమ్మల్ని చూసే అవకాశమే నాకు రాలేదు ఆ అదృష్టం నాకు ఈ రోజు కలిగింది అని వారి దగ్గరగా వెళ్లి పాదాభివందనం చేశారు బందాగారు ఎన్టీఆర్ ని కౌగిలించుకుని ఆనందించి సంభాషణ కార్యక్రమాన్ని రికార్డ్ చేశారు ఏక బిగిని 30 నిమిషాలు మాట్లాడారు రామారావు గారు వెళుతూ వెళుతూ గురువుగారూ మేము దేశం కోసం నాటకాన్ని ప్రదర్శిస్తున్నాము మీరు తప్పక విచ్చేసి మా కార్యక్రమాన్ని చూసి మమ్మల్ని ఆశీర్వదించాలి అని పాసులు ఎన్ని కావాలి అని అడిగారు మాకు కారు పాస్ ఉంది తప్పకుండా వచ్చి రికార్డు చేస్తాను నా ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి అని బందా గారు చెప్పారు. ఆయన జ్ఞాపకశక్తికి తప్పక జోహార్ చెప్పాలి తనతో జగ్గయ్య గారితో కలిసి రంగస్థలం నాటకాలు ఆడిన ఏ కమల కుమారి గారి గురించి మా రెడ్డి కమల గారు ఇక్కడ ఉద్యోగం చేస్తున్నారు కదా ఆవిడను చూడాలి అన్నారు అప్పుడే వస్తున్న కమల కుమారిని గుర్తించి ఏమండీ బాగున్నారా అని అడిగారు తారకం రామారావు గారి భార్య బసవతారకం ఎలా ఉంది అని అడిగితే మీ దయ వల్ల చాలా బాగున్నారు అని సమాధానం ఇచ్చారు పక్కనే ఉన్న నన్ను ఎన్టీఆర్కి పరిచయం చేస్తూ మా తమ్ముడు గారు బందా గారి నేతృత్వంలో ఆయన కథానాయకుడిగా చలామణి అవుతున్నాడు అనగానే మాకెందుకు తెలియదు మేము చాలాసార్లు కలిసాం వారి నాటకాలు కూడా వింటూ ఉంటాం రేడియోకు ఒక మంచి నటుడు అని కితాబిచ్చారు అది నా జన్మలో మరిచిపోలేని మధుర స్మృతి
ఆకాశవాణి విజయవాడ కేంద్రం;-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి