ఆకాశవాణి విజయవాడ కేంద్రం;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.

 ఇంటికి కుంపటి నాటక రంగానికి వెంపటి అవసరం అంటూ ఉండే వారు ఆ రోజుల్లో  కొత్త వాళ్లతో నాటకాలు వ్రాయించి రంగస్థలంపై ప్రదర్శన ఇస్తుండేవాడు వెంపటి  రెంటాల గోపాలకృష్ణ గారితో పునర్జన్మ నాటకం రాయించి ప్రదర్శనలు ఇచ్చారు తర్వాత దాన్ని  కుదించి గంటలాటకంగా రేడియోలో ప్రసారం చేయడానికి కథానాయకునిగా నన్ను ఎన్నుకొని నిర్వాహకులు సత్యం శంకరమంచి వెంపటిని రంగస్థలం మీద మీరు వేశారుగా  ఇక్కడ కూడా మీరే వేయండి అంటే నా ప్రవర్తన రేడియోకు కృత్రిమంగా ఉంటుంది లింగరాజు శర్మతో వేయిస్తే ఆ వేషానికి సరిగ్గా సరిపోతాడు  పాత్రల ఎన్నిక పట్ల అంత శ్రద్ధ తీసుకునేవారు ఆ రోజుల్లో  ఆ నాటకానికి ఎంత పేరు వచ్చిందో  శ్రోతలకు తెలుసు వెంపటి రేడియో మూర్తి గారితో రేడియో షాపు ఉండడం వల్ల మూర్తి గారిని అలాపించేవారు  కలిసి చాలా నాటకాలు ఆడాడు ప్రతినాయక పాత్రలో పేరు తెచ్చుకున్నారు ఆయనకు మంచి పేరు తెచ్చి పెట్టిన పౌరాణిక నాటకం  అమ్మవారు కనకదుర్గమ్మ దేవి ఉపాసకుడు జల సూత్రం రుక్మిణీ నాధశాస్త్రి  గారితో   18  శక్తి స్వరూప తత్వాన్ని వివరిస్తూ గొప్ప నాటకాలు నిర్వహించి దాన్ని ప్రచారం చేశారు  అలాంటి పెద్దలందరి మధ్య మసలాడం నాకెంతో ఆనందంగా ఉండేది. రిహార్సల్ అయిన తర్వాత మంచి టీ తాగుతూ బీడీ   దమ్ము లాగుతూ  రామ్మోహన్ రావు తో వెంపటి ఏరా వాడిని అంటే నన్ను  చిత్రహింసలు పెడతావు ఎందుకురా  తాను లేత తమలపాకులా చక్కగా సున్నితంగా చెబుతున్నాడు కదా అంటే అందుకే అతడు అంటే నాకు ఇష్టం. ఇంకా మెరుగులు పెడదామని అన్నారు రామ్మోహన్ రావు గారు. మా ఎనౌన్సర్స్ అందరికి శ్రీనివాస నగర్ అంటే చాలా ఇష్టం మా మంచి చెడులు చూసేది ఆయనే అందరితో కలిసి పోయేవారు అలా అని పూర్తి స్వేచ్ఛనిచ్చే వారు కాదు ఉదాహరణకు నేను స్టూడియోలో లేనప్పుడు ఆయన వచ్చి ఒకకాగితం మీద నేను వచ్చినప్పుడు నీవు స్టూడియోలో లేవు లేకపోవడం నేరం నా ఛాంబర్ కి వచ్చి కలువు అని వ్రాసి వెళ్లేవాడు  నేను వెళ్లి మిమ్మల్ని కలవడానికి కదా ఒకసారి వచ్చిందంటే అలా రాకూడదు స్టూడియో వదలకూడదు ఇదే నా వార్నింగ్ అని గట్టిగా మాట్లాడి ఆయన ప్లాస్క్ లో నుంచి ఆయనే కాఫీ గ్లాసులు పోయి స్థాయించి పంపించేవాడు  ఎవరైనా  ఏదైనా చిన్న పొరపాటు చేస్తే రెండు రోజులు మైక్ ముందుకు వెళ్లవద్దని ఆర్డర్ వేసేవారు  అది పెద్ద శిక్ష ఎంత బాధ అనిపిస్తుందో చెప్పలేం.
కామెంట్‌లు