అదే ఇప్పుడైతే ఎన్ని రోజులు మైకకు దూరంగా ఉండమని చెప్పితే అంత ఆనందించే పరిస్థితి అలాంటి మంచి మనిషిని గౌరవించాలని ప్రఖ్యాత సినీ రంగస్థల నటుడు రామన్న పంతులు గారి సమక్షంలో లింగరాజు శర్మ గారి ద్వారా పూలమాలతో సత్కరించాం బయట కార్యక్రమాలు రికార్డు చేసి రావడానికి ఓబి అంటాం అంటే అవుట్ బ్రాడ్ కాస్టింగ్ మొదట్లో కె వి ఎస్ కుటుంబరావు ఆ తర్వాత ఏవై మన్నార్ దానికి కొనసాంపిగా నేను ఉషశ్రీ గారు సత్యనారాయణ గారు తర్వాత కేవీ సుబ్బారావు, మధ్యలో వై హనుమంతరావు చివరిగా ఈ మధ్యనే మరణించిన సుభాష్ చంద్రబోస్ ఆ పరంపర నేటికీ కొనసాగుతూనే ఉంది.అలాగే పెద్ద వాళ్లకు బదిలీలు వచ్చిన సందర్భంలో కూడా మేమే ప్రధాన పాత్రధారులం బాల గురుమూర్తి గారికి హైదరాబాద్ బదిలీ అయిన సందర్భంగా మన్నార్ కుటుంబరావులు శ్రీనివాసున్ గారి అధ్యక్షతన సన్మానం చేశారు అన్ని కార్యక్రమాలలో ప్రధాన పాత్రధారులు ఎనౌన్సర్సే. 1962 ఆగస్టు 19వ తేదీన అప్పటి ప్రసార సమాచార శాఖ మంత్రి బెజవాడ గోపాల్ రెడ్డి గారు విజయవాడ వచ్చి వివిధ భారతి కార్యక్రమాల విభాగాన్ని ప్రారంభించారు అప్పుడు శ్రీవాత్సవ బుచ్చిబాబు సూర్యనారాయణమూర్తి శ్రీనివాసులు వారిని ఆహ్వానించి ప్రారంభోత్సవం అయిన తర్వాత పత్రికా విలేకరులతో ఏర్పాటు చేసి దానిలో గోపాల్ రెడ్డి గారి అభిప్రాయాన్ని పొందుపరిచారు.పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఆదేశాల మేర ఎలాంటి వ్యాపార ప్రకటనలు చేర్చకుండా చక్కటి పాటల కార్యక్రమంగానే వివిధ భారతీ కార్యక్రమాలను రూపొందించారు ఆ తర్వాత చాలా కాలానికి వివిధ భారతి వాణిజ్యప్రసారాలు ఏర్పాటు అయ్యాయి. శ్రీరస్తు గారంటే యండమూరి సత్యనారాయణ గారు మంచి రచయిత గొప్ప విమర్శకుడు రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన గీతాంజలి బెంగాలీ భాష నేర్చుకుని ఆ భాష నుంచి అనువదించారు గోపాల్ రెడ్డి గారి కార్యక్రమంలో రెడ్డి గారు శ్రీనివాసన్ గారు రవీంద్రనాథ్ బెంగాలీ రచనలను ఆ భాషలో ఉదాహరించడం ప్రత్యేకత శ్రీవత్సవ గారికి కార్యక్రమాలు చేయడంలో మక్కువ ఎక్కువ అనేక రూపాలను నాటకాలను రచించి ఆయనే నిర్వహించేవారు.
ఆకాశవాణి విజయవాడ కేంద్రం- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి