గోగర్భం పాప వినాశనం ఆకాశగంగా కుమారధార పసుపు ధార ఆనకట్టలు ఏర్పడి రాత్రింబవళ్లు పంప్ చేస్తున్న నీటి బొట్టుకు కటకటే నిజానికి పెద్ద పెద్ద కాంక్రీట్ సిమెంట్ తొట్టెలు ఎండ ఎక్కువగా ఇస్తే నీరు ఆవిరి అయిపోతూ ఉంటుంది కొండమీది ఎన్నో చెరువులు దరువులు చొచ్చుకువచ్చినా కాంక్రీట్ భవంతులు నిర్మాణాలతో అడుగంటిపోయి జలం లేని నేలగా మారిపోయింది తిరుపతి దోమల నిలయాలవుతున్నాయని మలేరియా భయంతో పలు కుంటలని టీటీడీ ఆరోగ్యశాఖ పూర్చి వేసింది. తిరుమల సహజ నీటి జలచక్రం తిరోగమనము ఎలా సంభవించిందో బోధపడింది కదా ఒక సన్నదు ద్వారా బ్రిటిష్ వారు క్రితం 1843 వ సంవత్సరంలో విచారణ కర్తలుగా మహంతులకు ఆలయ పాలనా పగ్గాలు అప్పగించేటప్పుడు తిరుమల గుడితో సహా దిగువ తిరుపతిలోని గోవిందరాజుల గుడి రాములవారి గుడి కపిల తీర్థం తిరుచానూరు తదితర 19 గుడి గోపురాలను కూడా అప్పగించారు వీటికి అనుబంధంగా మరో పదకొండు ఉపాయాలను కొన్ని తీర్థాలను కూడా ఆ జాబితాలో చేర్చారు అలాగే వాటి ఆస్తిపాస్తులు ఆభరణాలు వాహనాలు ఇతర సంపద కూడా మహంతుల అజమాయిషికి వచ్చాయి మహంతు సేవాదసు ధర్మదాసు భగవాన్ దాసు రామకిశోర దాసు చివర్లో ప్రయాగదాసు 1901 వ సంవత్సరం నుంచి 1933 వ సంవత్సర వరకు విచారణ కర్తలుగా కొనసాగారు మహంతు సేవా దాసు కింద ఎన్ని గుడి గోపురాలు ఉన్న తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుడి దగ్గర స్థానం. బలిమినే కలిమినిచ్చే అక్షయపాత్ర దాంతో తిరుమలగుడే ప్రధానంగా మిగతా ఆలయాలు పాలన కొనసాగింది దేశ సనాతన యాత్రకు వచ్చే యాత్రికుల ప్రథమ ప్రాధాన్యం శ్రీవారి దర్శనం ఆ తర్వాతనే మిగతా ఎన్ని సంగతులైనా అంటూ తాను చెప్పదలుచుకున్న విషయాలను చెప్పి 100 సంవత్సరాల క్రితం రాసిన రచనను ఎంతో కష్టపడి దానిని తిరిగి అక్షర రూపంలోకి తీసుకురావడానికి తన సన్నిహితుడు బి.వి.రమణతో రచనలో ఎక్కడైనా లోపించిన అక్షరాలు కనిపించినట్లయితే దానిని పూరించి అక్కడి ఆచార్యుల వారి అనుమతితో ఈ పుస్తకం మన ముందుకు తీసుకు వచ్చారు. ఇన్ని విషయాలను అందించి కష్టపడిన రెడ్డి గారికి వారి సన్నిహితులకు కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తూ ఏబి ఆనంద్, డాక్టర్ నీలం స్వాతి. ఇక అసలు విషయానికి వెళదాం.
మన తిరుపతి వెంకన్న- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి