ఇందిరాగాంధీ సరే పితాజీ మీకేం కావాలి మీకు ఏ విధంగా సహాయం చేయగలను మన శాఖను నేనే చూస్తున్నాను కనుక మీ కష్టాలు చెప్తే దానిలో పాలు పంచుకోవడానికి మీ కష్టాలు తీర్చడానికి ప్రయత్నం చేస్తానన్నారు ఆవిడ. అమ్మా ఇందిరాజీ బిడ్డ ఆకలి తల్లికి తెలుస్తుంది బిడ్డకు ఆ బాధ తెలీదు మిమ్మల్ని ప్రత్యక్షంగా చూసి మీ కరచాలన అందుకున్న మేము ఆ తన్మయత్వం లో ఉన్నాము నిజానికి స్వర్గంలో ఉన్నట్టుందమ్మ తల్లిగా మా అవసరాలు ఏమిటో మీకే బాగా తెలుసు మీరే చూడాలమ్మ రంగా నా మాటలు రాచకొండ వారి పద్య కవితా శైలి అద్భుతంగా ఆకట్టుకున్నాయి.
ఆమె వెళ్లిన తర్వాత పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడు జార్జ్ ఫెర్న్యాండ్ డేస్ కార్మికుల జీతభత్యాలను గురించి ప్రస్తావిస్తూ ఇందిరాగాంధీనీ ఉద్దేశించి మేడం మీ రేడియో కళాకారులకు ఎంత జీతం ఇస్తున్నారని ప్రశ్నిస్తే 150 రూపాయలు అని ఎంతో గర్వంగా చెప్పగానే మా బొంబాయి నగరంలో వీధులు ఊడ్చేవారికి ఇస్తున్నాము 150 రూపాయలు అన్నమాట ఈటెల్లా ఇందిరాగాంధీ గుండెకు తాకాయి అంతవరకు 150 రూపాయలు తప్పా మిగిలినవి ఇస్తారని తెలియని మాకు ఆమె మా జీతాలను బేసిక్ ఫీస్ గా చెప్పేసరికి జీతం తప్పా బచ్చాలు ఇస్తారని తెలియని మాకు జీతాలు రెండింతటి పైగా పెరగడంతో కళాకారులంతా ఆనందించారు భారతదేశంలో ఉన్న ఆకాశవాణి కళాకారులు అందరికీ మంచి జరిగింది పెరిగిన జీతాలు కూడా దాదాపు సంవత్సరం క్రితం నుంచి రావడం వల్ల చాలా మందికి 5000 వేల నుంచి పదివేల వరకు రొక్కం చేతికొచ్చింది. ఆ తర్వాత కొద్ది నెలల్లోనే ఆకాశవాణికి ముఖ్యమైన గొంతు అనౌన్సర్స్ కనుక వారికి లబ్ధి చేకూరే విధంగా వారిని మూడు భాగాలుగా చేసి రెండు రకాల వేతనాలు ఇచ్చారు అది కూడా దాదాపు 18 నెలల క్రితం నుంచి వచ్చేలా ఏర్పాటు చేశారు దాంతో చాలామంది ఇళ్ల స్థలాలు కొనుక్కొని ఒక ఇంటి వారు అయ్యారు అందులో నేను ఉన్నాను రంగస్థలం మీద నాతో అక్షరాలు చెప్పించింది ఏ. శివరామ రెడ్డి గారు డాక్టర్ వెంకట్ రాజు గారు అయితే ఆలిండియా రేడియోలో పదాలను పలికించింది సుబ్బారావు గారు నాటకాలలో వాక్యాలను అందంగా వినిపించేలా చేసింది బందా కనక లింగేశ్వర రావు గారు, సి వి సూర్యనారాయణ సి వి గారు కడపలో అక్షరాలను ఎంత సున్నితంగా చెప్పాలో తెలిపేలా చెప్పింది మల్లాది నరసింహ శాస్త్రి గారు.
ఆకాశవాణి విజయవాడ కేంద్రం;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి