మన తిరుపతి వెంకన్న- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 శిరస్సు ఛేదించడం వెంటనే ఆ శిరస్సు తిరిగి యధా స్థానంలోకి వస్తుంది. అలా 5000 సంవత్సరాలు  ఆరాధన చేయగా శ్రీమన్నారాయణ  ప్రత్యక్షమవగా  ఆ అసురుడు దండ ప్రణామములు గావించి స్తుతించి తనకు మోక్షముగాని స్వర్గముగాని  పరమపదము కానీ అవసరం లేదు  శ్రీవారితో యుద్ధం చేయాలన్న కోరిక నాకు ఉన్నది  అని విన్నవించుకున్నాడు.  యుద్ధములో ఆ రాక్షసుడు శ్రీవారితో కూడా పోరాడుతూ వారు ఏ రూపం దారిస్తే తాను ఆ రూపం ధరిస్తూ ఉంటాడు  విశ్వరూపము ధరించిన విశ్వరూపమును గరుడ వాహనారూడు గానుండా తానును అట్టుకాగా శ్రీవారు సుదర్శన ప్రయోగమచే  శిరస్సును ఖండించాడు.
ఆ తర్వాత చక్రపాణికి నమస్కరించి సుదర్శన మహిమ విన్నాను. ఆ చక్రరముతో చంపిన వాడికి పరమపదము  తప్పక వస్తుంది  ఆ చక్రముచే దగ్ధమైన నేను నా మందిరము  నాకు వెళుతున్నాను అని   వెళ్లాడు  ఏడుకొండల లో ఒకటి అంజనాచలము. ఈ ఏడుకొండలు విడివిడిగా ఉండవు ఒకదానిలో ఒకటి చొచ్చుకొని పోయి ఉంటాయి.  ఆకాశగంగా తీర్థం దగ్గరే అంజనాద్రి ఆంజనేయ స్వామి జన్మస్థలం అంటారు. అది విడిగా కనిపిస్తుంది కొండలకు ఆ పేర్లు ఎలా వచ్చాయో వ్రాయబడింది  ఆ తీర్ధానికి సూతక దోషం కరగకుండా జాబిలికి వచ్చి ప్రసవించింది  దానికి గుర్తుగా అక్కడ ఒక బండలు నాటారు  స్వయంభుగా మార్చారు అదే ప్రస్తుత జాపాలి ఆంజనేయస్వామి ఆలయం  అత్తి రాంజీ మఠం అధీనంలో  పూజలు అందుకుంటున్న  ప్రతి సంవత్సరం టిడిపి వారు పట్టు వస్త్రాలను సమర్పిస్తూ ఉంటారు. కేసరి భార్య అంజనాదేవి  త్రేతాయుగంలో పుత్రులు లేరు అన్న శోకంతో కన్నీళ్ళతో శరీరమంతా తడిసిపోయింది  మతంగ మహర్షి వద్దకు వెళ్లి సాష్టాంగ నమస్కారం చేసి తన దుఃఖ కారణాలు చెప్పుకొనగా మొత్తం విని పంపా  సరస్సునకు  పూర్వభాగాన 50 యోజనాల దూరంలో ఉన్న సింహ క్షేత్రం ఉంది  దాని దక్షిణంగా నారాయణగిరికి ఉత్తరాన ఉన్న  శ్రీ స్వామి పుష్కరిణి  క్రోసెడు దూరంలో ఉన్న ఆకాశ గంగ కు వెళ్లి 12 సంవత్సరాలు తపం చేసి  పుణ్యఫలం వల్ల సుపుత్రుడు  జన్మిస్తాడు అని చెప్పాడు  ఆ పుణ్యక్షేత్రంలో  తపస్సు చేసినాడు అశ్వద్ధ వృక్ష ప్రదక్షణాలు చేసి  శ్రీ వరాహ స్వామి వారి దర్శనం చేసుకుని ఆకాశ  గంగకు వెళ్లి మునుల యొక్క భర్త యొక్క ఆనతి తీసుకొని  ఆహార విసర్జన నియమములతో కలిగి తపస్సు చేసింది.

కామెంట్‌లు