నాతోనూ గురువుగారు నండూరి సుబ్బారావు గారితోనూ చాలా చొరవగా ఉండేది మా ఇంటి ఆడపడుచులా ప్రవర్తించేది మా ఇంటికి కూడా రావడం మా శ్రీమతి అరుణతో ఎంతో చక్కగా మాట్లాడుకునేది గురువుగారి ఇల్లు అన్నా మా ఇల్లు అన్నా తన సొంత ఇంటి గానే భావించేది ఆ తర్వాత రంజని అన్న యువతి మాలాగా అనౌన్సర్ లాగా చేరి కొన్ని నెలలు ఉద్యోగం చేసిన తరువాత కారణాల వల్ల పదవీ విరమణ చేసి వెళ్ళిపోయింది. అలాంటివారికి రేడియోలో పేరు రాదు కృష్ణ ప్రసాద్ గారు కూడా వచ్చారు ఎలా ఉంది సరిగా ఉన్నాడు కానీ ఎవరిని మెప్పించలేకపోయారు రమణమూర్తి గారు కొంతకాలమే ఉద్యోగం చేసి వేరే కాలేజీలో ఉద్యోగం రావడం వల్ల లెక్చరర్ గా వెళ్ళిపోయారు.నా తర్వాత వచ్చిన అడవి లింగరాజు శర్మగారు కోకా సంజీవరావు గారు వృత్తి రీత్యా అనౌన్సర్ గానే కాక నాటకాలలో ప్రతినాయక పాత్రలలో కూడా రాణించి పేరు గడించారు మా పేరి కామేశ్వరరావు గారు ముసలి పాత్రల్లో జీవించేవారు రంగస్థలం నాటకాలలో కూడా వీరు ముగ్గురు ప్రఖ్యాతిని పొందారు ఎస్వి శ్రీరామ్మూర్తి శిక్షణ పొంది వచ్చినవాడు కనుకనే మా కన్నా ఎన్నో మెళకువలను తెలుసుకొని తాను సృష్టించిన ప్రతి నాటకానికి రూపకానికి కేంద్ర ప్రభుత్వ బహుమతులు పొందగడిగాడు విజయవాడ ఏబీ కేంద్రాల తో పాటు ఢిల్లీ ఈఎస్టి లో కూడా నాతో కలిసి పని చేయడం చాలా ఆనందదాయకం మల్లాది సూరిబాబు తో పోటీపడి సంగీత కార్యక్రమాలు కూడా చేశాడు. లక్కా నర్సింగరావు రేడియో నాటకాల కంటే జంధ్యాల బృందంతో రంగస్థలం మీద ప్రదర్శించిన నాటకాలు ఎక్కువ తన సినిమాలలో కూడా వేషాలను ఇచ్చి నర్సింగరావును ప్రోత్సహించాడు తన ప్రజ్ఞాపాటవాలను కేంద్రం కంటే కూడా వేదికలపైనే ప్రదర్శించడం వల్ల రేడియో ద్వారా అతనికి ఏ ప్రయోజనము జరగలేదు డి ఎస్ ఆర్ ఆంజనేయులు లలిత సంగీతంలో పేరు తెచ్చుకున్నాడు ఆకాశవాణిలో కూడా కొన్ని లలిత గీతాలను ఆలపించాడు మా ఎం వాసుదేవ మూర్తి రంగస్థలం మీద తెచ్చుకోని బహుమతి లేదు గొల్లపూడి మారుతిరావు మా వాసు కోసం ప్రత్యేక నాటకాలు వ్రాశాడు రెండు రెండ్లు ఆరు నాటిక వాసుకు ఎంత పేరు తెచ్చిందో చెప్పలేం.
ఆకాశవాణి విజయవాడ కేంద్రం;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
• T. VEDANTA SURY
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి