.మద్యం తో లడాయి;- అంకాల సోమయ్య-దేవరుప్పుల జనగాం-9640748497
మందు చుక్క చికెన్ ముక్క పీకలదాకా తాగి తిని

ఒకడుఇంటిగుట్టు బయట పెట్టుకుండు

 మందు ఎక్కువ అయినంక 
ఒకడి (డు)
 అరపాటులోపొరపాటైన మాటకు పేట్రేగిపోయి
పచ్చి బరిగె అందుకొని
గొడ్డును బాదినట్టు బాదిండు

అడ్డు వచ్చినోళ్ళతో బూతుపురాణం మొదలుపెట్టిండు

పండక్కి పిలిచి నన్ను అవమానిస్తారా?
 అని బామ్మర్దిని కొట్టిందేగాక
అత్త మామను కూడా  కొట్ట కొట్ట పోయిండు

అక్కడ గుమిగూడిన జనాలు
గుంజుక పోయిండ్రు

ఏంది చెప్పు ?ఇది
సంతోషానికి పండుగ చేయబోతే
ఏంది లడాయి?.

ఈ మందు పాడుగాను
సోపతి తొవ్వ నాశనం అన్నట్టు

 తెల్ల కల్లు ,నల్ల కల్లు ,తాగి ఒళ్ళు పాడు చేసుకొని, యిల్లు పాడు చేసుకొని, నలుగురిలో నువ్వుల పాలవుడు తప్ప ఏమన్న ఫాయిదాఉన్నదా?!

కల్తీ మందు  కల్లు తాగి
ఆరోగ్యం పాడై
మంచం లో నవిసి నవిసి చస్తున్నారు?

మద్యం తాగే టోళ్ళు ఇపుడు చిన్న పెద్ద ముసలి ముతక అనే భేదం లేదు
పెళ్లికి మద్యం ,చావుకు మద్యం,
నలుగురు కూడితే మద్యం,

 మద్యంబ్రతుకుల్ని చిధ్రంచేసెను

మద్యం ఒక సామాజిక వెనుకబాటు
మద్యం ఒక సాంఘిక దురాచారం

మద్యం నీలో మైకాన్ని,
 నీలోని మనిషిని మృగాన్ని 
చేసి పతనపు అంచుకు 
తీసుకెళ్లి నిను ఒంటరిగా వదిలేసే ఓ పిశాచి ?
 మద్యంలేని సమాజం నెలకొల్పుదాం!
ఈరోజే ఇప్పుడే సంకల్పించుకుందాం
ఊరు వాడను ఏకంచేసి
మద్యం లేకుండా చేద్దాం
మద్య రహిత సమాజాన్ని నెలకొల్పుదాం2


కామెంట్‌లు