బాల్యం తిరిగి రానిది (బాల్యం ఓ జ్ఞాపకాలముల్లె);- అంకాల సోమయ్య దేవరుప్పుల జనగాం9640748497
బడులకు వేసవిసెలవులు ఇచ్చారు
పుస్తకాల బరువులకు
మస్తకాల ఒత్తిడికి
నిద్రలేమి ముఖాలకు
అర్ధాకలి కడుపులకు 

స్వస్తి పలికి 
దూర ప్రయాణానికి ప్రణాళిక వేసుకోవాలి

అది విజ్ఞాన విహారయాత్ర
అది వినోదయాత్ర
మనలో అంతర్లీనంగా ఉన్న సృజనను మేల్కొల్పాలి

లలిత కళల్లో
 ఏదో ఒక కళను
పట్టుబట్టి అభ్యసించాలి

మన మానసికోల్లాసానికై
ఈరోజేమనం నడుం కట్టాలి

 నడి నెత్తిన సూర్యుడు నిప్పులు కురిపించిన చల్లని పళ్ళ రసాలు
చల్ల చల్లని ఐస్ క్రీములు
 తాగుతూ తింటూ కడుపు చల్లబరుచుకుందాం

స్మార్ట్ ఫోన్ నిండా అందమైన దృశ్యాల్ని బంధిద్దాం

పంజరం విడిచిన పక్షులా
దూర తీరాలనైనా
 మన సంకల్ప బలంతో 
మనం చుట్టొద్దాం

పాపం పుణ్యం తెలియని పసికూనలం మనం
మానవ సేవ మాధవ సేవగా దివ్యాంగులకు వృద్ధులకు 
సాయం చేద్దాం

ఓఅమ్మానాన్నలూ
మీ పసితనాన్ని
 మా (ఈ)వేసవి సెలవుల్లో మాతోపాటు జ్ఞాపకం తెచ్చుకుందురు 
మాతో రండి

మీ ఆనందానుభూతిని
మాలో చూసుకొని మురిసిపోదురు

మళ్లీ బాల్యంలోకి
మీరెళ్ళెదరు

బాల్యం ఓ జ్ఞాపకాలముల్లె
పదిల పరుచుకుందాం
ఓ మధుర జ్ఞాపకంలా



కామెంట్‌లు