పేదరికం వెనుకబాటు తనం
కృషి పట్టుదలతో తోకముడిచాయి
సివిల్స్ విజేతైతే
మా యింటికి మీడియా క్యూకట్టింది
జన నీరాజనం
అమ్మముఖంలో
ఆనందం
ఆక్షణం
నాలో విజయగర్వం
విద్య ఆర్థిక వనరై
దారి చూపిన వైనం
ధనాన్ని మంచిన సంతృప్తి
విద్యాధనముతో
నాకిప్పుడు అనిపిస్తుంది
ఎవడు పేదవాడంటే
ఎలాంటి ఆలోచన లేనివాడని
ఏపని చేయాలన్నా
భయంతో వణికిపోయేవాడు
ఎప్పటికీ విజేతకాలేడు
పేదరికం శాపం కాదు
దాన్ని
అధిగమించకపోవడమే
మన వెనుకబాటుతనానికి
మూలకారణం
(బీడీలు చేసేతల్లి కొడుకు సివిల్స్ విజేతగా నిలిచిన సందర్భాన్ని పురస్కరించుకొని)
అంకాల సోమయ్య
దేవరుప్పుల
జనగాం
9640748497
[9:48 am, 23/04/2024] Somaiah Ankaala: పుస్తకం హస్తభూషణం
పుస్తకం మస్తకభూషణం
@@@@@@@@@@
అనుభవజ్ఞుల
అనుభవసారమై
అజ్ఞానంబాపిన
దీపమై
హస్తకభూషణమై
మస్తకవికాసమై
భావి జీవితమై
బ్రతుకు సేద్యానికి
ఆధారభూతమై
అచేనత్వంనుండి
చేతనత్వానికి
చీకటి నుండి
వెలుగులోకి
మూఢత్వం నుండి
హేతువాదం వైపు అడుగులు
వేసేలా చేసిన
పుస్తకం
సకల మనోవికారాలను
పటాపంచలు చేసి
గురువై ,
దైవమై
స్నేహితుడై
తప్పొప్పులు సరిదిద్దే
మార్గదర్శైనది
పుస్తకాన్ని
తలవంచి చదివాను
ఆ పుస్తకం నేడు
నన్నుతల ఎత్తుకొనేలా చేసింది
నా ఆత్మగౌరవబావుటా పుస్తకం
నా ఆత్మకథలో పుస్తకానిదే
శిఖరాగ్రము
పుస్తకాలను చదవండి
మస్తకాలను జ్ఞానంతో నింపండి
పుస్తకమేవ జయతే
పుస్తకాలు చదవండి చదివించండి
పుస్తకాలను అన్ని విశేషమైన రోజుల్లో బహుమతి గా ఇవ్వండి
(ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా వ్రాయబడిన కవిత)
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి