మనమెటు వెళ్తున్నాం
మన జీవనోపాధుల్ని కోల్పోయి
ఉచితాలకై అర్రులు చాస్తున్నాం
ఇది ప్రజాసంక్షేమమా?
కాదు! కాదు !ముమ్మాటికి కాదు
మనుషుల్ని సోమరులచూసే
దుష్టపన్నాగం?
మనకు జ్ఞానముంది?
మనకు స్వీయ వ్యక్తిత్వముంది?
మనకు ఆత్మ గౌరవముంది?
ఇవన్నీ తుంగలో తొక్కి దేబిరించి
ముఖం వాచినట్టు ఉచితాలకై
ఎగబడుతున్నాము?
ఏలెటోడి మహేంద్రజాలం
మనల్ని ఉన్మాదులను చేసింది
మనమంతా ఇపుడు సొంతంగా
ఆలోచించడమే మానేసాము
ఎనభై దశకంలో హామీలంటే?
ఆవులు ,ఎద్దులు ఎడ్లబండ్లు
ఎన్నికల్లో మాపార్టీని గెలుపిస్తే
దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ఇస్తమనెటోళ్ళు
అలా లబ్ది పొందిన నిరుద్యోగికి
ఎద్దులు, ఎడ్లబండ్లు వ్యవసాయ పనులకు మరియుఆవులు పాడికి అక్కరకొచ్చేవి
గుంట
వ్యవసాయ భూమి లేని వ్యవసాయ కూలీలకు
ఈ సంక్షేమం
జీవనాధారంగా నిలిచిదేది
కానీ నేడు
దేశ రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసే
నగదు బదిలీ పథకాలు
ఇప్పుడు బరిలో ఉన్న ఆయా పార్టీలు
గెలుపే ఏకైక లక్ష్యంగా అలవికాని హామీలిస్తూ ప్రజాధనాన్ని దుబారా
చేస్తున్నాయి
ఈ వ్యవస్థ మారాలి సంక్షేమం
కాదు మాకు కావల్సినది
సాధికారత అని నినదించాలి
ప్రతి ఐదేళ్లకు ఒకసారి కొత్త పార్టీ
కే పాలనను కట్టబెట్టాలి
విద్య వైద్యం న్యాయం పేదవాడికి ఉచితంగా అందాలి
సమాజంలో వ్రేళ్ళూనుకొని పోతున్న ధనికపేద అనే అంతరాలు దూరం కావాలి అవినీతి బంధుప్రీతి
లేని సుపరిపాలన మనకందాలి
భారత రాజ్యాంగం ప్రకారం
ప్రతి వ్యక్తికి స్వేచ్చగా జీవించే
హక్కుంది
దాన్ని హరించే
దుర్మార్గులను కఠినంగా శిక్షించాలి
స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరగాలి
ప్రలోభాలకు, కానుకలు ,మద్యం
డబ్బు కసలే ప్రాధాన్యత ఉండరాదు
ప్రజాస్వామ్యమంటే ప్రజలచేత
ప్రజలకొరకు ఎన్నుకోబడ్డ వ్యవస్థ నే ప్రజాస్వామ్య అని
అంటారు కదా
అందుకే రాజ్యాంగ విరుద్ధం
ప్రవర్తించే పార్టీలకు ఎన్నికల సంఘం ఎన్నికలనుండే
బహిష్కరించాలి
ప్రజాసేవ చేయాలనుకునే నిస్వార్థపరులే ఎన్నికల్లో నిలబడి ప్రజాస్వామ్యాన్ని
ప్రజల జీవన ప్రమాణస్థాయిని
పెంచేవారినే
ఓటరు మహాశయులు ఎన్నుకుంటామని మనసా వాచా కర్మేణా నిర్ణయించుకోవాలి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి