అక్షరమే ఆయుధమై
సాగుతున్న సమరానికి
సంసిద్ధులు కండి
మీరు మునుముందుకు
నడవండి
అజ్ఞానం బాపే చదువు
జ్ఞానాంజన దిద్దే చదువు
బడియే గుడిగా
గురువే దైవముగా
కొలుద్దాం రండి
పుస్తకాలతో దోస్తీ కడదాం
అక్షర లక్షలు పోగేద్ధాం
తరగని ధనము
విద్యాధనము
పొందుదాం
దొంగలు దోచని ధనము
దోపిడీ చేయని ధనము
పదుగురికి పంచినా
పెరిగే ధనము
అదే అదే విద్యాధనము
బిరబిర 2
రారండి
బడి పిలుస్తుంది
బ్రతుకును వెలిగించే
గుడి పిలుస్తుంది
రారండోయ్ రారండి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి