కాలమంటే జ్ఞానము;- అంకాల సోమయ్యదేవరుప్పుల జనగామ9640748497
 కాలమంటే
జ్ఞానము2
కాలమంటే
దైవము2
కాలమంటే
గురువు రా2
కాలమే
మార్గదర్శిరా2
ఒడిసిపట్టితె
కాలము2
ఓటమన్నదుండునా2?!
విడిచిపెట్టితే
కాలము2
గెలుపు మనకు
దక్కునా2?!
అంబేద్కర్ గాంధీజీ
కాలమే
తమగురువనిరి2
పనుల వాయిదాను
ప్రోత్సాహించక
త్వరిత గతిన పూర్తి చేసిరి2
ఉన్నతికైన
పతనానికైన
కాలమేగద
మూలము2
బద్దకస్తులకు
గిట్టని
విషయమేగద
కాలము2?!
అమలుచేస్తే
కాలము
అమీరు సాబు
వవుదువూ2
వృధా చేస్తే
కాలము
కట్టుబానిస
వవుదువూ2


కామెంట్‌లు