అష్టాక్షరీ గీతి
🔆🪷🔆
తెలుగు వారందరికి
తొలిపండుగ "ఉగాది"
ఎంతో విశిష్టమైనది
సంవత్సరాది ఉగాది!
🪷 (2)
ఆత్మీయు లందరితోను
కలిసి కట్టుగానుండి
మనుగడ సాగించుట
ఆనందమైన ఉగాది!
🪷(3)
తెలుగు వారిరువురు
కలుసుకొను నప్పుడు
తెనుగులో మాట్లాడుట
తియ్య తియ్యని ఉగాది!
🪷 (4)
"నేను"అను స్వార్థ బుద్ధి
విడనాడి, "మనం"అను
సద్బుద్ధి కల్గియుండుట
అది మేలైన ఉగాది!
🪷(5)
విభిన్న సంప్రదాయాలు
కలిగిన మనమంతా
సహజీవనం చేయుట
నవయుగాది ఉగాది!
🪷 (6)
నవ రసాలము పైన
కవికోకిల రాగము
ఆలాపన కావించిన
అది వసంత ఉగాది!
🔆🪷🔆
తెలుగు వారందరికి
తొలిపండుగ "ఉగాది"
ఎంతో విశిష్టమైనది
సంవత్సరాది ఉగాది!
🪷 (2)
ఆత్మీయు లందరితోను
కలిసి కట్టుగానుండి
మనుగడ సాగించుట
ఆనందమైన ఉగాది!
🪷(3)
తెలుగు వారిరువురు
కలుసుకొను నప్పుడు
తెనుగులో మాట్లాడుట
తియ్య తియ్యని ఉగాది!
🪷 (4)
"నేను"అను స్వార్థ బుద్ధి
విడనాడి, "మనం"అను
సద్బుద్ధి కల్గియుండుట
అది మేలైన ఉగాది!
🪷(5)
విభిన్న సంప్రదాయాలు
కలిగిన మనమంతా
సహజీవనం చేయుట
నవయుగాది ఉగాది!
🪷 (6)
నవ రసాలము పైన
కవికోకిల రాగము
ఆలాపన కావించిన
అది వసంత ఉగాది!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి