శ్రీమాత! పరదేవత! (అష్టాక్షరీ గీతికలు) కవిమిత్ర, శంకర ప్రియ., శీల., సంచార వాణి: 99127 67098
   "శ్రీ"యనగా శక్తి, యుక్తి
సామర్థ్యము కలిగించు
    "మాత"వీవె ప్రజలకు!
 శ్రీమాత! పరదేవత! (1)
      
    జవసత్త్వము లొసంగు
"శక్తి"రూపిణివి నీవె!
    "సత్తెమ్మ" తల్లివి నీవె!
శ్రీమాత! పరదేవత! (2)
    "శ్రీ"యనగా సిరి, హరి
ఐశ్వర్యము ప్రసాదించు
    "మాత"వీవె భక్తులకు!
 శ్రీమాత! పరదేవత! (3)
      
    భోగ భాగ్యము లొసంగు
"లక్ష్మి"రూపిణివి నీవె!
    "ధనమ్మ" తల్లివి నీవె!
శ్రీమాత! పరదేవత! (4)
      ఓం శ్రీమాత! జయ శ్రీమాత! జయజయ శ్రీమాత!

కామెంట్‌లు