వచ్చావా! వచ్చావా! ఓ
క్రోధి నామ వత్సరమా!
మానవాళికి శుభ వార్త
ఇల తెచ్చావా! తెచ్చావా!
శిశిర ఋతువును తరిమావా!
వసంత వీణను మీటావా!
ఆఘమేఘాలపై వచ్చి
మండే ఎండలు చూశావా!
ఆకలి కేకలు విన్నావా!
రైతుల వెతలు కన్నావా!
తెలుగు వారి వత్సరమా!
అప్పుల మూట విప్పావా!
రైతులు బాగుంటేనే
బ్రతుకులు బాగుంటేనే
నిజమైన ఉగాది కదా!
అందరు బాగుంటేనే
0
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి