ఎలా..ఇలా ఉండాలి;- -గద్వాల సోమన్న,9966414580
కలసిమెలసి బ్రతకాలి
మాలలో దారంలా
చేయి చేయి కలపాలి
పైపైకి ప్రాకు తీగలా

పలకరిస్తూ ఉండాలి
పూలలోని తావిలా
పులకరిస్తూ మసలాలి
కలల సాకారంలా

విశాల హృదయముండాలి
విరిసిన మందారంలా
అందరి మేలు కోరాలి
ఉదయించే సూర్యునిలా

నలుగురికి సాయపడాలి
భువిలో ఊత కర్రలా
ఆదర్శమే చూపాలి
సంఘజీవి చీమలా


కామెంట్‌లు