పరోపకారులవుదాం!!;- -గద్వాల సోమన్న,9966414580
సూర్యచంద్రుల రీతి
చీకటిని తరుముదాం!
జీవితంలో ఖ్యాతి
సంపాదించుకొందాం!

గగనమంత హృదయం
మనం కల్గియుందాం!
మహిని అరుణోదయం
వోలె సాగిపోదాం!

దండలో దారమై
సమైక్యత చాటుదాం
మనసున్న వారమై
భువిని మసలుకుందాం

పంచభూతాలలా
మనం సాయపడుదాం!
పరోపకారులలా
అవనిలో వెలుగుదాం!

కామెంట్‌లు