అందాల "బుజ్జి మేక";- -గద్వాల సోమన్న,9966414580
అందమైన బుజ్జి మేక
అలంకరణ చేసుకుంది
అందచందాలతోడ
కనువిందే చేసింది

రిక్కించిన చెవులతో
ముద్దులొలికే ముక్కుతో
పదే పదే చూసింది
సొగసులీను కళ్ళతో

చిట్టిపొట్టి కాళ్ళతో
ఉన్ని అన్ని  తనువుతో
దర్జాగా నిలుచుంది
అమాయకపు చూపులతో

భలే! భలే! బుజ్జి మేక
కల్గియుంది చిన్న తోక
చూడు చూడు వయ్యారం
చూస్తుందో! ఎంచక్కా


కామెంట్‌లు