స్నేహమనెడి బంధము;--గద్వాల సోమన్న,9966414580
స్నేహమనెడి బంధము
సృష్టిలోన అందము
బంధాల్లో శ్రేష్టము
బ్రతుకుల్లో క్షేమము

విలువైనది స్నేహము
అది ఆరోప్రాణము
మహిలో మణిదీపము
మదిలో దైవరూపము

ఆపదలో సాయము
అహర్నిశలు త్యాగము
కల్గియుండు స్నేహము
బ్రతుకున బహుమానము

చెలిమి వంటి బంధము
ఉంటేనే భాగ్యము
భువిని స్వర్గధామము
బలిష్టమైన దుర్గము

స్నేహానికి ద్రోహము
ఎప్పుడు చేయరాదు
నమ్మిన స్నేహితుణ్ణి
కలనైన వీడరాదు

కామెంట్‌లు