భక్తి ముక్తి దాయకం (రుబాయీలు));- -అద్దంకి లక్ష్మి -ముంబై
 1
సీతరామ కళ్యాణా వైభోగము రారండి 
 మామిడాకు తోరణాలు 
మండపమూ రారండి
 మంగళకర నాదాలవి మధురంగా మ్రోగుచుండె
 భక్తి ముక్తి కలిగించే మహోత్సవము రారండి
2
దుష్టజనుల శిక్షించగ జన్మించే శ్రీరాముడు
 భక్తజనుల బ్రోవగాను కనికరించె శ్రీరాముడు
తండ్రి మాట వినుచునడిచె సీతతోడ అడవులకును
 దశకంఠుని హతమార్చగ అవతరించె శ్రీరాముడు
3
ఊరు వాడ జనులు గూడి జరిపినులే కల్యాణము
శ్రీరాముని సీత తోడ జరిగెనులే కళ్యాణము
రంగ రంగ వైభవముగ కన్నులకూ విందు చేసె
రామనవమి సందడులను తెచ్చెనులే కళ్యాణము
4
శ్రీరాముని పెండ్లికొడుకు చేసినారు మగువలంత 
 సీతమ్మకు పూలజడను వేసినారు మగువలంత
 ఇరువురినీ పెండ్లిపీట కూర్చుండా పెట్టినారు
 కళ్యాణా వైభోగమె పాడినారు మగువలంత
5
రాముడంటె దైవమేను నమ్ముకుంటె రక్ష మనకు
రామ మంత్ర ప్రతిరోజు జపియించగ దీక్షబూను
హిందువులకు రాముడేగ ఎల్లవేళ మార్గదర్శి
జీవితమున ధ్యానమేగ చేయవలెను ముక్తి కొరకు

కామెంట్‌లు