. బాబా సాహెబ్ ; కేశరాజు వేంకట ప్రభాకర్ రావు పాతర్లపాడు ఖమ్మం.
పల్లవి 
జయ జయ జయ జయ భారతి సుతుడా 
జయ కేతనమెగరేసిన జయం నీకు ధీరుడా 
భయ మెరుగని ధీశాలివి భారత యోధుడా 
దయ తోడగ దారి చూపే అంబేద్కరుడా !!
చరణం.....1
ఊరి చివర కాడు వెలిగే దాపున ఉన్నా 
పూరి గుడిసె ఆవాసం నీదే నన్నా
కోరి చదువు సంస్కారం పొందావన్నా 
పోరి స్వేచ్ఛా స్వాతంత్ర్యం తెచ్చావన్నా!!
చరణం... 2
రేయి  పగలు కష్టించి రాసావన్నా
భాయి భాయి అనమంటు రాజ్యాంగాన్ని 
మోయలేని భారాన్ని మోసావన్నా 
రాయి లాంటి బతుకులలో వెలుగే నీవన్నా!!
చరణం....3
దేశానికి దిక్కై నిలిచావన్నా 
దిశలు దశలు మార్చిన మారాజువు నీవన్నా
దగా కోరు రాజకీయం దడి కట్టిందన్నా 
దళిత వాడలకు నిన్ను పరిమితం చేసిందన్నా!! 

కామెంట్‌లు