కవిశ్రేష్ట శ్రీ రాజేంద్రప్రసాద్ పుస్తకావిష్కరణ ఘనసన్మానము
  ఉగాది సందర్భముగా సిటి కల్చరల్ సెంటరు, హైదరాబాదులో  మంగళ వారం  మహర్షి వాల్మీకి సాంస్కృతిక సేవా సంస్థ మరియు భారతీయ సాహితీ అనువాద ఫౌండేషను నిర్వహించిన ఉగాది సమ్మేళనములో శ్రీ రాజేంద్రప్రసాద్ గారు వ్రాసిన పుస్తకము 'సుమ సౌరభాలు ' ను కేంద్ర సాహితీ సలహామండలి సభ్యులు శ్రీ నాళేశ్వరం శంకరం గారు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమములో గౌరవనీయులు శ్రీ కొలకలూరి ఇనాక్ గారు, శ్రీ వి. డి. రాజగోపాల్ గారు, శ్రీ బిక్కి క్రిష్ణ గారు, శ్రీమతి రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి గారు  తదితరులు పాల్గొన్నారు. శ్రీ రాజేంద్రప్రసాద్ గారు కవిసమ్మేళనములో పాల్గొని మన తెలుగుభాష కవితను పాడి అందరిని అలరించారు. పాల్గొన్న అతిధులు కవులు మరియు ఇతర ఆహ్వానితులు కరతాళధ్వనులతో తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు. తరువాత శ్రీ రాజేంద్రప్రసాద్ గారిని ఘనముగా సత్కరించారు. పాల్గొన్నవారందరూ శ్రీ ప్రసాద్ గారికి అభినందనలు తెలిపారు.
కామెంట్‌లు