..ఓటు ;. కోరాడ నరసింహా రావు.!

 పల్లవి:-
ఓటు విలువ రెండు వేల నోటుకాదు రన్నయా...! 
 ఓటు విలువ ఫుల్ బాటిల్ మందు కాదు రన్నయ..!! 
 ఓటంటె ఐదేలు మాబ్రతుకుల
బాధ్యత నీదే నంటూ వేలి చుక్కవేయించుకు...మనమిచ్చే ప్రా0సరి నోటన్నయ..!! 
    " ఓటంటె.... "
చరణం:-
    నీ హక్కును నువ్వమ్మేసి....
 ఐదేళ్లు బానిసలా బతుకుతావఅన్నయ..!? 
 ఓటు పాలకులనుశాసించేఆయుధముర అన్నయ... 
 నీ పిలక వారి చేతి కిచ్చి 
  నువ్ పాట్లు పడకు రన్నయ..!! 
         " ఓటంటె..... "
చరణం;-
 నీ బతుకుకు భరోసా...ఎవరో
 తెలుసు కోర అన్నయ.... 
 వారినే గెలిపించి ఐదేళ్లు
  సుఖ పడరా అన్నయ...!! 
   నువ్వు సుఖ పడరా అన్నయ
   నువ్వు సుఖ పడరా అన్నయ!!! 
         *******

కామెంట్‌లు