పిల్లలూ ---చద్దన్నం ..!!----సత్య గౌరి.మోగంటి .
 చద్దన్నంలో కాసిన్ని మజ్జిగ లేదా గడ్డ పెరుగు వేసుకుని,ఆవకాయ ముక్క నంచుకు తింటే అంతకు మించిన రుచికరమైన బ్రేక్‌ఫాస్ట్ ఉండదు. ఎందుకంటే చద్ది అన్నంలో శరీరానికి కావాల్సిన చాలా పోషకాలు లభిస్తాయి.
పూర్వకాలం మా చిన్నతనాలలో
చద్దన్నమే ఉదయపు అల్పాహారం.
అందుకే ఆరోగ్యాలు కూడా అంత బాగుండేవి.
పిల్లలు ఈ అన్నం తింటానికి ఎగురుకుంటూ వచ్చి తినేసి హాయిగా స్కూల్సుకు వెళ్లిపోయేవారు.
ఇక ఇందులో ఉండే ఎన్నో పోషకాలు మన శరీరానికి ఎంతగానో మేలు చేస్తాయట.ఈ విషయాన్ని ఇటీవల అమెరికన్ న్యూట్టరిషియన్ అసోసియన్ జరిపిన అధ్యయనాల్లో వెల్లడైంది.100 గ్రాముల రాత్రి అన్నంలో 3.4 మిల్లి గ్రాముల ఐరన్ ఉంటే అదే తెల్లవారే సరికి చద్దన్నంగా మారితే 73.91మిల్లీ గ్రాములకు పెరుగుతుందని అధ్యయనంలో తేలింది. బీ6, బీ 12 తదితర విటమిన్లు సైతం ఇదే తరహాలు రెట్టింపుగా మారిపోతాయని నిర్ధారించారు.అన్నం పులిస్తే అందులో ఐరన్,పొటాషియమ్,కాల్షియం వంటి సూక్ష్మ పోషకాల స్ధాయి రెట్టింపవుతుందట.
ఎదిగే పిల్లలకు రాత్రి మిగిలిపోయిన అన్నాన్ని తెల్లవారిన తరువాత చద్దన్నంగా అందిస్తే మంచి పౌష్టికాహారంగా ఉపయోగపడుతుంది. శరీరంలోని అలర్జీ కారకాలు,మలినాలు తొలగిపోయి పిల్లలు ఉత్సహాంగా ఉంటారు.పీచుదనం కారణంగా మల బద్దకం,నీరసం లేకుండా ఉంటుంది. శరీరానికి అవసరమైన బ్యాక్టీరియా లభించటంతోపాటు,బిపీ,ఆందోళన తగ్గుతుంది.రాత్రి మిగిలిపోయిన అన్నంలో పాలుపోసి తోడువేసుకుని ఉదయాన్నే తింటే దానంత ఆరోగ్యప్రదంమరోటి లేదన చెప్పాలి.
ఈ అన్నం మాత్రం ఉదయమే తినాలి.
ఆలస్యంగా తిన కూడదు.
చద్దన్నాన్ని రాత్రంతా మజ్జిగలో నానబెటుకుని ఉదయాన్నే తింటే లావు ఉన్నవారు సన్నబడతారు. పాలుపోసుకుని తోడేసుకుని తింటే సన్నగా ఉన్నవారు లావు అవుతారని
మా అమ్మమ్మ,అమ్మ చెప్పేవారు.
ఆరోగ్యానికి ఇంతగా మేలు చేకూర్చే చద్ధనాన్ని మాత్రం వదిలిపెట్టకండి.
అన్నంలో అత్యంత ఎక్కువ ప్రయోజన కరమైన బ్యాక్టీరియా లభిస్తుందని అంటున్నారు.బ్యాక్టీరియా జీర్ణ ప్రక్రియకు సహాయ పడుతుంది.అలాగే అనేక వ్యాధులతో పోరాడడానికి ఇమ్యూనిటీని మెరుగు పరుస్తుంది.ఇలా మిగిలిపోయిన చద్ది అన్నం తినడం వల్ల ఎముకలకు సంబందించిన అనారోగ్య సమస్యలు రావంటారు.కండరాల నొప్పులు దూరంగా ఉంటాయి.చద్ది అన్నం తీసుకోవడం వల్ల అన్నంలో లభించే పోషకాలు వలన చర్మ సమస్యలు,  ఎలర్జీలు,ఎగ్జిమా,దురద వంటి వాట్ని దూరంగా ఉంచుతుంది.
అల్సర్స్ నివారిస్తుంది...
అన్ని రకాల అల్సర్స్ కు దూరంగా ఉండాలంటే చద్ది అన్నం ప్రతిరోజూ తీసుకోవచ్చని సూచిస్తున్నారు.  శరీరానికి హానిచేసే బాడీ హీట్ తగ్గిస్తుంది,అంటే చలవ చేస్తుందంటారు.
చద్ది అన్నం లో పీచుపదార్ధం ఎక్కువగా ఉండడం వల్ల దీనిని ప్రతిరోజూ తీసుకుంటే కాన్స్టిపేషను సమస్య తగ్గుతుంది.
చద్ది అన్నం తీసుకోవడం వల్ల బ్లడ్ ప్రెషర్ ఒత్తిడి కూడా తగ్గుతుందని నిపుణులు పేర్కొన్నారు.
చద్ది అన్నం ఉదయాన్నే తీసుకోవడం వల్ల అలసట సమస్య దరి చేరదు.  ఆహారం మిమ్మల్ని రోజంతా ఫ్రెష్ గా ఉల్లాసం గా ఉత్సాహంగా ఉంచుతుంది. 
ఇంకో ముఖ్యమైన విషయం మనపూర్వీకులు చద్ది అన్నం తిని వందేళ్ళు ఆరోగ్యంగా అనారోగ్యం అన్నది లేకుండా బతికారు. చద్ది అన్నంలో ఉన్న పోషకాలు మన శరీరాన్ని గట్టిగా ఉంచుతాయి ఆ... ఆహారం లో ఉన్న కమ్మదనం,రుచి ఇప్పటి బ్రేక్ ఫాస్ట్ లో ఉండదు.

కామెంట్‌లు