తిరుపతి శ్రీ శ్రీ కళా వేదిక ఆధ్వర్యంలో జర్నలిస్టులకు ఆత్మీయ సన్మాన కార్యక్రమం

 అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన సంస్థ శ్రీ శ్రీ కళావేదిక తిరుపతి జిల్లా శాఖ మరియు అంతర్జాతీయ చైర్మైన్ శ్రీ కత్తి మండ ప్రతాప్ గారి సారథ్యoలో  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరుపతి జిల్లా అధ్యక్షులు శ్రీ అరవ జయపాల్ మరియు రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి ధనాశి ఉషారాణి సంయుక్త నిర్వహణలో శ్రీ రామ నవమి శుభాకాంక్షలు తో అక్షరానికి పట్టాభిషేకం చేస్తూ తిరుపతిలోని ప్రెస్ క్లబ్ లో జర్నలిజములో సేవలు అందించిన సీనియర్ జర్నలిస్టులకు ఆత్మీయ సత్కార కార్యక్రమంను మే 17 తేదీన నిర్వహిస్తున్నట్టు తిరుపతి జిల్లా అధ్యక్షులు శ్రీ అరవ జయపాల్ మరియు ప్రధాన కార్యదర్శి ధనాశి ఉషారాణి తెలియజేశారు.28 ప్రపంచ రికార్డులు సాధించిన ఏకైక సంస్థ శ్రీ శ్రీ వేదిక  నెల నెల సాహితీ క్రతువు నిరoతర సాంస్కృతిక ప్రభంజనంలో భాగంగా నిర్వహిస్తున్న వినూత్న కార్యక్రమంకు శ్రీ శ్రీ వేదిక రాష్ట్ర అధ్యక్షులు మరియు జాతీయ ఉపాధ్యక్షులు శ్రీ గుత్తా హరి  సర్వోత్తమ నాయుడు గారు   ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేయనున్నారు.శ్రీ భూమన గారు శ్వేత డైరెక్టర్ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి విశిష్ట సేవలు అందించిన 30 మందికి దుస్సాలవ మెమెంటోతో సత్కరించనున్నారు.అతి తక్కువ సమయంలో జానపదములో మూడు  పెద్ద కార్యక్రమాలను నిర్వహించిన సీనియర్ జర్నలిస్టు  శ్రీ అరవ జయపాల్ గారిని ప్రముఖ రచయిత్రి తెలుగు ఉపన్యాసకురాలు ధనాశి ఉషారాణి ని జాతీయ కమిటీ  సభ్యులు కొల్లి రమావతి గారు ఈశ్వరి భూషణo గారు చిట్టె లలిత గారు పార్థసారథి గారు హరి సర్వోత్తమ నాయుడు గారు అభినందనలు తెలియజేసారు. ఆంతర్జాతీయ చైర్మెన్ శ్రీ కత్తి మండ ప్రతాప్ గారు తిరుపతి నూతన కమిటీ నిర్వహిస్తున్న సరి కొత్త వినూత్న సాహిత్య  కార్యక్రమం అని అభినందనలు తెలియజేసారు కార్యక్రమంలో తిరుపతి కార్యవర్గ సభ్యులు అందరూ పాల్గొననున్నారు
కామెంట్‌లు