556)పుష్కరాక్షః -
ఆకాశమంత వ్యాపించినవాడు
తీర్థ విశేషాలున్నట్టి వాడు
శ్రేష్టమైన జలమునున్నవాడు
కోనేటిరాయుడు తానైనవాడు
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!
557)మహామనా -
గొప్పదైనమనసు గలవాడు
విశాలత్వమును గలిగినవాడు
మనోభీష్టములు తెలియువాడు
ప్రాప్తిని గలిగించగల వాడు
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
558)భగవాన్ -
ఆరులక్షణములున్నట్టి వాడు
సమగ్రభక్తినొసగువాడు
మోక్షం ప్రసాదించుచున్నవాడు
బుద్ధదేవుడు పూజ్యుడైనవాడు
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
559)భగహా-
ప్రళయం నందున్నట్టివాడు
విభూతులుపోగొట్టుకొనువాడు
వైరాగ్యం నిలుపుచున్నవాడు
మాహత్వము చూపించువాడు
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
560)ఆనందీ -
ఆనందమునొసగునట్టివాడు
ముదమును కలిగించువాడు
సంతోషప్రదాయకుడైనవాడు
జీవులకు ఆహ్లాదమొసగువాడు
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి