511)దాశార్వ-
దాశార్వ వంశజుడైనవాడు
విష్ణుసేవకులను బ్రోచువాడు
దాశార్హుడుగా నున్నట్టివాడు
వెన్నుడుగా విలసితమైనవాడు
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
512)స్వాత్వతాంపతిః -
యదుకులముకు ప్రభువైనవాడు
అనేకలీలలు చేయునట్టివాడు
గోలోకముకు పతియైనవాడు
సత్వగుణములను పాలించువాడు
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
513)జీవః -
జీవుడు తానై యున్నట్టివాడు
ప్రాణస్వరూపముగా నున్నవాడు
పరమాత్మయై నడిపించేవాడు
జీవితత్వము సంపూర్ణమైనవాడు
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
514)వినయతా సాక్షి-
భక్తులకు సాక్షిగా నుండేవాడు
వినయమును ప్రోదిచేయువాడు
గురుసాక్షిత్వముగలిగిన వాడు
వినమ్రతను గలిగించువాడు
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
515)ముకుంద-
ముక్తినొసగునట్టి వాడు
ఎర్రతామరల వంటివాడు
మణివిశేషమైయుండువాడు
విష్ణువు అవతారమయినవాడు
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
(సశేషం )
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి