భక్తి ముక్తి దాయకం;- -అద్దంకి లక్ష్మి -ముంబై
పల్లవి
రామచంద్ర రఘువీరా
 రామచంద్ర రణధీర
 రామచంద్ర జగన్నాధ
 రామచంద్ర పరంధామా

చరణం 1
 రామాయణము పూజనీయము
 రామ కథనము ఆచరణీయము
అయోధ్య రాముడు అవతార పురుషుడు  రఘుకుల సోముడు నీలమేఘ శ్యాముడు 

2 చరణం
పితృవాక్య పరిపాలనే ధ్యేయము
 సీతారాముల ఆదర్శ దాంపత్య జీవనము
   అన్నదమ్ముల ప్రేమను బంధము
 భారతీయ సంస్కృతికి మూలము

3 చ
భక్త శబరికి చిట్టి ఉడుతకు ముక్తి నొసగెను 
నమ్మిన హనుమంతుని అక్కున చేర్చెను
 అహల్యకు శాపవిమోచన మొసగెను
 విభీషణుని లంకాధిపతి గా చేశాను

4 చ
ధర్మము నాలుగు పాదాల నడిపించెను
 సకల సుఖశాంతుల రామరాజ్యము
రామ రామ యనుచు తారకమంత్రము
 జపించుటే జీవన ముక్తి ప్రదము

కామెంట్‌లు