జీవితంలో విషాద సంఘటనలు జరిగినా, మృత్యువు ముఖాముఖిగా ఎదురుపడినా తొణకక, బెనకక అనస్థితితో కుడిన ధీరత్వం , మిన్ను విరిగి మిద పడినా, కాళ్ళ కింద నేల బ్రద్దలై భూగర్భంలోకి జారిపోయే విపత్కర పరిస్థితులలో కూడా భయపడక నిలదొక్కుకొనే స్థైర్య ప్రశాంత స్వభావం అలవరచుకోవడం ఎంతో అవసరం. మనిషి పొంగిపోవడం, కుంగిపోవడం ఆయా సందర్భాల్లో భావ తీవ్రతను బట్టి సంభవిస్తూ ఉంటుంది. కానీ, తనను తాను నిగ్రహించుకుంటే ఈ భావతీవ్రత అతన్ని స్థితప్రజ్ఞుడిగా నిలుపుతుందే తప్ప భావోద్వేగాలకు లోనుకానివ్వదు. అది సాధించినప్పుడే మనిషి వ్యక్తిత్వం ఉన్నతం అవుతుంది. అప్పుడే కర్తవ్య నిర్వహణకు సిద్ధమై కార్యసాధనకు అది తోడ్పడుతుంది.శీతోష్ణాలు, సుఖదుఃఖా లు, పుణ్యపాపాలు ఇలాంటి ద్వంద్వాలు ప్రతి మనిషినీ ఎంతో ప్రభావితం చేస్తాయి. ఇది హృదయ ధర్మం. ఇక్కడే మనిషి తన మానసిక దృఢత్వాన్ని నిరూపించుకోవాలి. రెండిటినీ సమదృష్టితో చూడగలిగే మానసిక పరిణతికి మనిషి ఎదిగితే అతను నిజమైన ధైర్యవంతుడు అనిపించుకుంటాడు. కర్మ బంధాలలో చిక్కుకున్నా, సంసార భ్రమాణంలో మునిగిపోకుండా, సుఖాలకు లొంగి పోకుండా దుఖాలకు కుంగిపోకుండా ఆవేశానికి, కోపానికి లోబడక మానసిక ధైర్యంతో, ధీరత్వంతో ఒడిదుడుకులను తట్టుకుంటూ నిర్వికారంగా జీవించేవారు అసలు సిసలైన ధీరులు అనిపించుకుంటారు.
ఇటీవల జరిగిన ఉదాహరణ పై తత్వానికి ఉదాహరణగా నిలుస్తుంది.
చిర్యాల జిల్లా నెన్నెల మండలం కుశ్నపల్లి గ్రామానికి చెందిన ఏలూరి శంకర్ 9 తరగతి చదువుతుండగా విద్యుత్ షాక్‌తో తన రెండు చేతులు కోల్పోయాడు. విద్య ద్వారానే జీవన ఉన్నతికి చేరుకోవచ్చునని భావించి నాటి నుండి నేటి వరకు పట్టు వీడకుండా మనో ధైర్యంతో చదువుతూ నేడు డిగ్రీ పరీక్షలను కాళ్లతో రాశాడు.
బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీకాం కంప్యూటర్స్ మొదటి సంవత్సరం చదువుతున్న శంకర్ శుక్రవారం ఫస్ట్ సెమిస్టర్ పరీక్షలలో భాగంగా స్థానిక భవిత డిగ్రీ కళాశాలలో పరీక్షా సెంటర్‌కు చేరుకొని కాళ్లతో పరీక్ష రాసి తోటి విద్యార్థులకు ఆదర్శంగా నిలిచాడు. భవిష్యత్తులో మంచి ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తానని నమ్మకంగా చెప్తున్నాడు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి