ఓటు విలువ చాటుతున్న కీర్తి పట్నాయక్

 ఆంధ్ర విశ్వవిద్యాలయం, ఇంజనీరింగ్ కళాశాలలకు వెళ్ళి 
నూతనంగా ఓటుహక్కు పొందిన యువతకు శ్రీదేవి విజ్ఞాన జ్యోతి పరిష్కార్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షురాలు డా.కీర్తి పట్నాయక్ చైతన్యం కల్గిస్తున్నారు. 
క్రీడా ప్రాంగణాలలోనూ, వసతి భవనాలయందు ఉన్న విద్యార్థులతో ఓటుకున్న విలువలగూర్చి వివరిస్తున్నారు. ఇంజనీరింగ్ విద్యార్థులకు, భాస్కర్ హస్టల్ విద్యార్థులకు ఈనెల 13న జరుగుతున్న ఎన్నికల్లో ప్రలోభాలకు లొంగకుండా ఓటుహక్కును వినియోగించుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్యం ప్రాధాన్యతను గుర్తెరిగి విద్యార్థులంతా స్వేచ్ఛగా ఓటు వేయాలని కీర్తి అన్నారు. 
విధిగా ఓటు వేయాలని, నిర్లక్ష్యం వహించరాదని అన్నారు. నగదుకు, కానుకలకు తమ ఆత్మాభిమానం పోగోట్టుకోవద్దని, ఎలాంటి వత్తిడిలకు లొంగకుండా ప్రతి ఒక్కరూ ఓటును వినియోగించుకోవాలని ఆమె అన్నారు. యువతరం తమ ఓటును సమాజాభివృద్ధికి దోహదపడేలా చూడాలని కీర్తి పట్నాయక్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో యువసేవ అధ్యక్షుడు హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు