ఆలోచించు;- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
ఏదారిన
నడుస్తావు
నిజాయితీగా
ఎన్నాళ్ళు ఉంటావు

ఎంతదూరం
పయనిస్తావు
లక్ష్యాలను
ఎపుడు చేరుకుంటావు

ఎంతసమయం
చూస్తావు
అందాలను
ఎప్పటిదాకా ఆస్వాదిస్తావు

ఎందాకా
ఏకాకిగావుంటావు
తోడును
ఎపుదు తెచ్చుకుంటావు

ఏరీతిగా
స్పందిస్తావు
అందరినీ
ఎలా ఆకర్షిస్తావు

ఎవరెవరిని
ఆహ్వానిస్తావు
మర్యాదలు
ఎమేమి చేస్తావు

ఎక్కడిదాకా
వెళతావు
చేరి
ఏమి సాధిస్తావు

ఎంతసేపు
ఆలోచిస్తావు
తుదినిర్ణయము
ఎపుడు తీసుకుంటావు

ఎవరుచెప్పింది
వింటావు
తదుపరి
ఎలా స్పందిస్తావు

ఎవరికోరిక
మన్నిస్తావు
ఇచ్చినమాటను
ఎట్లా నిలుపుకుంటావు

ఎవరిని
ప్రసన్నంచేసుకుంటావు
నమ్మకాన్ని
ఎప్పటిదాకా నిలుపుకుంటావు

కామెంట్‌లు