అమ్మ నీ ఒడిలో....; - శ్రీనివాస్ మొగిలి - శ్రీ శ్రీ మొగిలి - మర్రిపల్లి

 అమ్మ నీ ఒడి చేరాలనివుంది 
నన్ను కన్న నేల తల్లి నీ ఒడిలో 
సేదా తీరాలనివుంది 
నీతో నాకు వున్నా జ్ఞాపకాలు కొన్నే 
వాటిని తలుచుకున్నపుడల్లా నా కళ్ళు 
సెలయేరులా.......చెమ్మగిల్లే 
నా బాల్యం బంధువుల్ని కలవాలనివుంది 
చిన్ననాటి స్నేహితుల చెలిమి చెంత 
చేరాలనివుంది 
చదువు నేర్పిన పాఠశాల గోడ గుర్తుల్ని 
తకాలనివుంది 
వారంతాపూ సెలవు దినాలలో 
అలుపెరుగని ఆటలు క్రికెట్ వాలీబాల్ 
ఆడాలనివుంది 
నూతి బాయిలల్లా కోతి కొమ్మ ఆట 
ఈత కొట్టాలనివుంది 
సాయంత్రం గల్లీ గద్దెలమీద కూర్చొని 
ఓడవని ముచ్చట్లు పెట్టాలనివుంది 
నీ లాలీ పాటలు నాకు పాట నేర్పింది 
నీ పాలనా నాకు కవిత(త్వం)నేర్పింది 
గడిచినా నా ప్రస్థానం వదిలి 
నీ ఒళ్ళో వాలిపోవాలనివుంది 
నా అనవాళ్ళు అన్నిటిని కలే తిరిగి 
అలింగానం చేసుకోవాలనివుంది 
అమ్మ నీ ఒడిలో......................
 
కామెంట్‌లు