బాలల వికాసానికి బాలసాహిత్యం ఎంతో అవసరం అలాంటి బాలసాహిత్యం బడిపిల్లలు రాయడం అట్టి నీతివంతమైన కథలు పుస్తకరూపంలో రావడం సంతోషమని చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ చైర్మన్ మణికొండ వేదకుమార్ అన్నారు. గతంలో సిద్దిపేట జిల్లా బడిపిల్లల కథలు రెండు పుస్తకాలు హైదరాబాద్ లోని దక్కన్ ప్రెస్ లో బాలచెలిమి, చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ చైర్మన్ మణికొండ వేదకుమార్, ప్రొపెసర్ రఘు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహితలు చొక్కాపు వెంకటరమణ, కన్నెగంటి అనసూయ, బాలచెలిమి కన్వీనర్ గరిపల్లి అశోక్, సంపాదకులు ఉండ్రాళ్ళ రాజేశం చేతుల మీదుగా ఆవిష్కరణ జరిగింది. ఈసందర్భంగా వేదకుమార్ మాట్లాడుతూ బడిపిల్లల సాహిత్యం ఎంతగానో బాలల వికాసానికి తోడ్పడుతుందని, కల్మషం లేని బాలలు భవిష్యత్ తరాలకు నిర్మాతలని అన్నారు. సిద్దిపేట జిల్లాలో బాలసాహిత్య రచనలకు కొదువలేదని, బాలసాహిత్య వికాసంలో సిద్దిపేట ముందు నిలుస్తుందన్నారు. సిద్దిపేట బడిపిల్లల కథల పుస్తక సంపాదకులు, బాలసాహితీవేత్త ఉండ్రాళ్ళ రాజేశం బాలసాహిత్యంలో చేస్తున్న కృషిని అభినందించారు. 54 కథలతో రెండు సిద్దిపేట జిల్లా బడిపిల్లల కథల సంకలనాలు రెండుపుస్తకాలుగా ప్రచురించడం జరిగింది. కార్యక్రమంలో ప్రముఖ రచయితలు, మొలక మాసపత్రిక సంపాదకులు టి.వెదాంతసూరి, బాలసాహిత్య రచయితలు వి.ఆర. శర్మ, కృష్ణమూర్తి, జానకిరామ్, రామన్, సుదర్శన్, పద్మావతి, నీరజ, గిరిజ, పద్మ తదితరులు పాల్గొన్నారు.
సిద్దిపేట బడిపిల్లల కథల పుస్తకావిష్కరణ
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి